చిత్రలహరిలో అదో మేజర్ హైలైట్ అంటున్నారే

Mon Feb 11 2019 12:40:08 GMT+0530 (IST)

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'చిత్రలహరి' షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. లవ్ స్టొరీలను అందంగా తెరకెక్కించే టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాను ఒక లవ్ స్టొరీగానే రూపొందిస్తున్నాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవడం కామనే కానీ.. అలా ఫిక్స్ అయిన వారందరికీ కిషోర్ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇస్తాడట.ఆ సర్ ప్రైజ్ ఏంటంటే పోసాని క్రిష్ణ మురళి. అయన పేరు చెప్పగానే మీ పెదవులపై ఒక చిరునవ్వు వస్తే ఏం చేయగలం.. అది అయనకే సొంతమైన టాలెంట్.  ఈ సినిమాలో తేజు తండ్రిపాత్రలో పొసాని నటిస్తున్నారట.  తేజు-పోసాని బంధం ఎమోషనల్ గా సాగుతుందట.  ఒకవైపు హీరోయిన్లతో లవ్ ట్రాక్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో తండ్రితో బాండ్ కూడా ఈక్వల్ గా అంతే పవర్ఫుల్ గా ఉంటుందట. టైటిల్స్ నుండి ఎండ్ కార్డ్ వరకూ తేజు-పోసాని ట్రాక్ హీరో-హీరోయిన్ల లవ్ స్టొరీకి సమాంతరంగా సాగుతుందట.  పోసాని అంటేనే ఒక ఎమోషన్.. ఆయనతో తేజు ఎమోషనల్ సీన్స్ అంటే డౌట్ లేకుండా ఆడియన్స్ ను ఎమోషనల్ చేస్తాయని మనం ఫిక్స్ అయిపోవచ్చు.  

కల్యాణి ప్రియాదర్శన్.. నివేద పెతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. 'చిత్రలహరి'కి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.