Begin typing your search above and press return to search.

37 కార్లు.. 4 ట్రక్కులు.. సాహో..

By:  Tupaki Desk   |   21 May 2018 5:43 AM GMT
37 కార్లు.. 4 ట్రక్కులు.. సాహో..
X
బాహుబలి తరువత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కోసం ప్రస్తుతం దేశమంతా ఆసక్తికరంగా చూస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా ఎలా ఉంటుందా అని చాలా వరకు టాలీవుడ్ మీడియాపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. హిందీలో కూడా ఆ సినిమా రూపొందుతుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్ మళ్లీ తన బాక్స్ ఆఫీస్ స్టామినను చూపిస్తాడు అని మిడియలో కథనాలు వెలువాడుతున్నాయి.

ప్రస్తుతం లేటెస్ట్ గా అందిన ఒక అప్డేట్ గురించి తెలిస్తే అది కూడా దేశమంతా వైరల్ అయ్యేలా ఉంది. అదేమిటంటే.. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రధానమని అందరికి తెలిసిన విషయమే.. దర్శకుడు సుజిత్ - హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్ని బేట్స్ ఆ సీన్స్ కోసం చాలా ప్లాన్స్ వేసుకున్నారు. రీసెంట్ గా దుబాయ్ లో కొన్ని సీన్స్ చేసిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. సిజి వర్క్ అవసరం లేకుండా రియాలిస్టిక్ గా ఉండాలని నిజమైన కార్లతో ట్రక్కులతో ఛేజింగ్ సీన్స్ ను చిత్రీకరించారు.

37 suv కార్లు అలాగే నాలుగు ట్రక్కులు ఢీకొట్టే విధంగా సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు. అందు కోసం నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో ఖర్చు పెట్టింది. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు సాగుతున్నారు. అవసరం అయితే బడ్జెట్ లిమిట్ క్రాస్ చెయ్యాలని కూడా అనుకుంటున్నారు. ఫైనల్ గా మంచి అవుట్ పుట్ ఇవ్వాలని దర్శకుడు సుజిత్ కష్టపడుతున్నాడు. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాల్లో నెయిల్ నితిన్ ముఖేష్ మెయిన్ విలన్ గా కనిపించనున్నారు.