Begin typing your search above and press return to search.

హే పిల్లగాడా అనేసిన లక్షల వ్యూయర్స్

By:  Tupaki Desk   |   24 Sep 2017 1:30 AM GMT
హే పిల్లగాడా అనేసిన లక్షల వ్యూయర్స్
X
నటించింది నాలుగు సినిమాల్లోనే. గ్లామర్ షోలు అస్సలు ఇవ్వలేదు. కానీ అమ్మడిని చూస్తే ఎంతటివారికైనా హృదయంలో ఒక మంచి అనుభూతి కలుగుతుంది. నవ్వుతోనే పడేసే ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి. ఆ సినిమా తర్వాత కొంత మందికి తెలిసిన ఈ ముద్దుగుమ్మ ఫిదా తో తెలుగు ప్రేక్షకులందరిని ఫిదా చేసింది. గత సినిమాలు లాగానే ఫిదా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది.

ఆ సినిమాలో నటించిన వరుణ్ తేజ్ కి కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. శేఖర్ కమ్ములకు కూడా మాయమవుతున్నాడు అనుకున్న టైమ్ లో ఫిదా సక్సెస్ ని ఇచ్చింది. ఇలా హీరోకి - దర్శకుడి కెరీర్ కి బూస్ట్ ఇచ్చిన ఫిదా విజయానికి అసలు కారణం సాయి పల్లవి అనే చెప్పాలి. అమ్మడు సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి అందరిని ఆకట్టుకుంది. సాయి దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా యొక్క "హే పిల్లగాడా" అనే పాటను యూట్యూబ్ లో రీసెంట్ గా రిలీజ్ చేశారు. సాయి కార్తీక్ అందించిన సంగీతం శేఖర్ కమ్ముల విజన్ కి కరెక్ట్ గా సెట్ అవ్వడంతో ఆ పాట సినిమాలో హైలెట్ గా నిలిచింది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే 5 లక్షలమంది చూశారు.

దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు సినిమా ఎంతగా పాపులర్ అయ్యిందో. మొన్నటి వరకు ఆంధ్ర అందాలే సినిమాల్లో ఎక్కువగా ఉండేవి కానీ దర్శకుడు తెలంగాణ విలేజ్ లొకేషన్స్ కూడా పాటకు అనువుగా ఉంటాయని ఈ పాత ద్వారా చూపాడు. పాట కొత్తగా అనిపించడంతో ప్రేక్షకులు ఈ వీడియో సాంగ్ ను పదే పదే చూడటానికి ఇష్టపడుతున్నారు.