Begin typing your search above and press return to search.

నాని-సుధీర్ మ‌ల్టీస్టారర్ బ్యూటీస్

By:  Tupaki Desk   |   15 April 2019 6:12 AM GMT
నాని-సుధీర్ మ‌ల్టీస్టారర్ బ్యూటీస్
X
లేటెస్ట్ ట్రెండ్ లో వ‌రుస‌గా మ‌ల్టీస్టార‌ర్లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నాని ఇదివ‌ర‌కూ కింగ్ నాగార్జున‌తో క‌లిసి `దేవ‌దాసు` అనే మ‌ల్టీస్టార‌ర్ లో న‌టించారు. ప్ర‌స్తుతం సుధీర్ బాబుతో క‌లిసి `వ్యూహం`(వ‌ర్కింగ్ టైటిల్) అనే మల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్నాడు. ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అష్టా చెమ్మా, జెంటిల్ మేన్ లాంటి హిట్ చిత్రాల్ని నానీకి అందించిన ఇంద్ర‌గంటి, స‌మ్మోహ‌నం లాంటి అబౌ యావ‌రేజ్ చిత్రాన్ని సుధీర్ బాబుకు అందించారు. ఆ క్ర‌మంలోనే హిట్ కాంబోతో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు నిర్మాత‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ‌లానా క‌థానాయిక‌ల్ని ఎంపిక చేసుకుంది టీమ్ అనే అధికారిక స‌మాచారం లేదు. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. అదితీరావ్ హైద‌రీ, నివేద థామ‌స్ ల‌ను క‌థానాయిక‌లుగా ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. నాని-అదితీ.., సుధీర్ బాబు - నివేద థామ‌స్ జంట‌లుగా న‌టించ‌నున్నార‌ట‌. ఇక‌పోతే అదితీరావ్ ఫైన‌ల్ అయ్యింద‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చినా నివేద మాత్రం పారితోషికం విష‌యంలో బెట్టు చేసింద‌ని, ఆ క్ర‌మంలోనే దిల్ రాజు బుజ్జ‌గించి ఒప్పించే ప్ర‌య‌త్నం చేశార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ జూలై మిడిల్ లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. డిసెంబ‌ర్ లో ఎట్టి ప‌రిస్థితిలో రిలీజ్ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నార‌ట‌. నాని నెగెటివ్ షేడ్ రోల్ పోషిస్తుండ‌గా, సుధీర్ బాబు ఓ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నార‌ట‌.

వ్యూహం అనే టైటిల్ వినిపిస్తోంది కాబ‌ట్టి క‌థాంశం ఎలా ఉంటుంది? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇదో రియాలిటీ ఇంటెలెక్చువ‌ల్ గేమ్ త‌ర‌హా చిత్ర‌మా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. రియ‌ల్ లైఫ్ పై ప్ర‌యోగాలు.. రియాలిటీ గేమ్స్ నేప‌థ్యంలో హాలీవుడ్ లో ప‌లు ఆస‌క్తిక‌ర చిత్రాలు వ‌చ్చాయి. వ్యూహాన్ని ఛేదించి విన్ అయిన వారికి ముగింపులో మ‌తి చెడే బ‌హుమ‌తి ఉంటుంది. ఈ గేమ్ ప్రాణాంత‌కం గా కూడా ఉంటుంది. ప్రాణాలు పోవ‌చ్చు.. ప్ర‌మాదాల నుంచి బ‌య‌ట‌ప‌డి బ‌త‌క‌నూ వ‌చ్చు! అయితే గేమ్ లో పార్టిసిపెంట్స్ అన్ని కండిష‌న్ల‌కు ఒప్పుకుని సంత‌కం చేశాకే ఆట మొద‌ల‌వుతుంద‌న్న‌మాట‌. ఈ త‌ర‌హా హాలీవుడ్ లో ఎన్నో. అయితే ఇంద్ర‌గంటి `వ్యూహం` ఏ త‌ర‌హా చిత్రం? అన్న‌ది మూవీ ప్రారంభోత్స‌వంలో ఇంద్ర‌గంటి వెల్ల‌డిస్తారేమో చూడాలి. ప్ర‌స్తుతానికి ఇవ‌న్నీ స్పెక్యులేటెడ్ స్టోరీస్ గానే భావించాల్సి ఉంటుంది.