Begin typing your search above and press return to search.

వాళ్లకు ఫ్రెండ్షిప్‌ డే బ్యాండ్‌ కట్టారా?

By:  Tupaki Desk   |   2 Aug 2015 7:55 AM GMT
వాళ్లకు ఫ్రెండ్షిప్‌ డే బ్యాండ్‌ కట్టారా?
X
గ్లామర్‌ ప్రపంచంలో హీరోయిన్‌ .. ఓ అందమైన గాజుబొమ్మ. జాగ్రత్తగా ట్రీట్‌ చేయకపోతే పగిలిన గాజుముక్కలు ఒళ్లంతా గుచ్చుకోవడం ఖాయం. ఈ అందాల బొమ్మను షోకేస్‌ లో బొమ్మలా ట్రీట్‌ చేయాలి. లేదంటే కాలుతుంది. అంతేకాదండోయ్‌ దాదాపు 24శాఖల్లో పనిచేసే మగపురుగులందరినీ ట్రీట్‌ చేయాలంటే ఈ గాజుబొమ్మకు ఓ పక్కా ప్లానింగ్‌, కట్టిపడేసే ఫార్ములా అవసరం. అదేంటో మన నాయికలంతా ఎప్పుడో కనిపెట్టేశారు. పురుషాహంకారానికి ముకుతాడు వేసే ఒకే ఒక్క ఆయుధం 'రాఖీ'. ఇప్పుడున్న స్టార్‌ హీరోయిన్లంతా ఈ ఆయుధాన్ని వజ్రాయుధంలా వాడేస్తున్నారు. నవతరం నాయికలు కూడా వీళ్లనే ఫాలో అయిపోతున్నారు.

అమాయక లేడి కోసం పొంచి ఉండే మేకవన్నె పులుల నుంచి గాయపడకుండా బైటపడడానికి ఈ ఆయుధం భలేగా పనిచేస్తుంది. అయితే ఈ ఆయుధం కొందరి విషయంలో మాత్రం అస్సలు పనిచేయదు. అందులో హీరోలు, దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటుల్లో కొందరిపై ఇది పనిచేయకపోవచ్చు. అందుకే కథానాయికలు వీళ్లకు రాఖీలు కట్టే పని పెట్టుకోరు. అయితే తమకి వ్యక్తిగత పీఆర్‌ వో (పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌)గా పనిచేసే వాళ్లకు మాత్రం తప్పని సరిగా రాఖీ కట్టేస్తారు.

ఎందుకంటే తమ పారితోషికాలు నిర్ణయించే దగ్గర్నుంచి డబ్బు వసూలు చేసి అకౌంట్లో వేయడం వరకూ, అటుపై కాల్షీట్లు సర్ధుబాటు చేసే విలేకరులతో చిట్‌ చాట్‌ లు ఏర్పాటు చేసే వరకూ అంతా వీళ్లపైనే ఆధారపడి ఉంటుంది. పీఆర్‌ వోకి మాత్రమే తెలిసే కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ మెయింటెయిన్‌ చేయాలంటే సోదరసోదరీ బంధం హీరోయిన్‌ -పీఆర్‌ ఓ మధ్య అవసరం. అందుకే పీఆర్‌వోలకు రాఖీ గిఫ్ట్‌ గా కట్టేస్తారన్నమాట! ప్చ్‌ పాపం పీఆర్‌ వోలు!!