హీరోయిన్లకు ఎనర్జీ అదే

Sat Oct 07 2017 05:00:01 GMT+0530 (IST)

హీరోలే కాదు మేము కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలం అనేలా ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ కథానాయికలు. అంతే కాకుండా వారి కెరీర్ కు ఆ సినిమాలు మంచి బూస్ట్ ని ఇస్తున్నాయని చెప్పాలి. ఏ మాత్రం ఆలోచించకుండా కరెక్ట్ కథలొస్తే కథానాయికలు చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలోను చిత్ర కథానాయికలు లేడి ఓరియెంటెడ్ సినిమాలను తీస్తున్నారు.అంతే కాకుండా కొందరికి వారి కెరీర్ కాస్త డౌన్ అయినప్పుడు ఆ చిత్రాలు ఎనర్జీని ఇస్తున్నాయి. గతంలో అనుష్క అరుంధతితో ఏ స్థాయిలో తన స్టామినాను చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఆమె కెరీర్ ను ఈక్వల్ గా సెట్ చేసుకుంటూ వస్తోంది. ఎక్కువగా హీరోయిన్స్ కథలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయడానికే ఇష్టపడుతున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇపుడు రాజుగారి గది సినిమాలో మేజర్ రోల్ చేయబోతోంది. ఆ సినిమా మొత్తం సమంత చుట్టే తీరుగుతుందట. అలాగే తమన్నా కూడా ప్రస్తుతం క్వీన్ అనే చిత్రం చేస్తోంది. బాలీవుడ్ రీమేక్ గా వస్తున్న ఆ సినిమా కోసం మిల్కి బ్యూటీ చాలా ఇష్టంగా చేస్తోంది. ఆ కథలో కూడా తమన్నా పాత్ర హైలెట్ అవ్వడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక రీసెంట్ గా  తాప్సి కూడా ఆనందోబ్రహ్మ అని నవ్వుతో భయాన్ని భయపెట్టే ప్రయత్నం చేసి అందరిని అలరించింది. ఆ చిత్రం ఆమె కెరీర్ కు చాలా బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. వరుస అపజయాలతో ఉన్న తాప్సి ఆ చిత్రంతో కొంచెం హ్యాపీ అయ్యింది. అంజలి కూడా గీతాంజలి తరువాత చతికిలపడినా.. ఇప్పుడు బెలూన్ తో వస్తోంది. ఇక అదే తరహాలో చాలా మంది హీరోయిన్స్ హర్రర్ - థ్రిల్లర్ నేపథ్యంలో సినిమాలను తీసి వారి కెరీర్ కు మంచి ఎనర్జీని తెచ్చుకున్నారు.