ఆర్ ఆర్ ఆర్ : బంగారు బాతులు ఎవరు ?

Wed Nov 14 2018 12:14:01 GMT+0530 (IST)

రాజమౌళి అనేది పేరు నుంచి బ్రాండ్ గా మారి అటుపై ఇంకాస్త పైకెళ్లిపోయి ఏ పదాన్ని వాడాలో అర్థం కానీ స్థాయికి చేరుకుంది. బాహుబలితో తెలుగు వాడి సత్తాను ప్రపంచ సినిమాకు పరిచయం చేసిన రాజమౌళి ఏది చేసినా సంచలనానికి తక్కువ స్థాయిలో ఎప్పుడూ ఉండదు. దానికి తోడు ఇప్పుడు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుకు ఎవరితో సినిమా చేసినా టన్నుల కొద్దీ హైప్ వస్తోంది. అలాంటిది మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ల కాంబోని సెట్ చేసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.ఇటీవలే పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఆర్ ఆర్ ఆర్ టైటిల్ గురించి రకరకాల వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఇవి చాలదు అన్నట్టు ఇప్పుడు హీరోయిన్ల గురించి గాసిప్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఎవరూ ఖరారు కానప్పటికీ కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నట్టు టీమ్ లో ముఖ్యమైన వాళ్ళతో డిస్కషన్ లో ఉన్నట్టు వినికిడి. కానీ అసలు ఎవరు లిస్ట్ లో ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. తనకు కాల్ వచ్చినప్పుడు వేరే సినిమాలకు కమిట్ అయిన కారణంగా ఇది మిస్ అవ్వడం ఇష్టం లేని కొందరు స్టార్ బ్యూటీస్ కొత్తవాటికి సైన్ చేయడానికి టైం అడుగుతున్నారట. ఒకవేళ జక్కన్న నుంచి ఏ పిలుపు రాకపోతే వీటికి ప్రొసీడ్ అవ్వొచ్చు అన్న ఉద్దేశంతో. ఒకవేళ పిలిస్తే వీళ్లకో చిన్న సారీ చెప్పేయొచ్చు.

ఇప్పుడీ వరసలో తమిళ్ లో యమా బిజీగా ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నట్టు టాక్. వాళ్ళు ఒప్పుకున్న రెండు మూడు సినిమాలు ఫైనల్ స్టేజి లో ఉన్నాయి. కొత్తవి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాజమౌళి కాల్ రావొచ్చనే నమ్మకంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిసింది. మరి ఫైనల్ గా ఆర్ ఆర్ ఆర్ లో ఇద్దరు హీరోల సరసన ఆడిపాడే ముద్దుగుమ్మలు ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగక తప్పదు