Begin typing your search above and press return to search.

ఈసారి టార్గెట్‌ ఎక్స్‌ పోజింగుపైనా?

By:  Tupaki Desk   |   3 Aug 2015 8:04 PM GMT
ఈసారి టార్గెట్‌ ఎక్స్‌ పోజింగుపైనా?
X
ఇటీవలే మ్యాగీ నూడిల్స్‌ బ్యాన్‌ చేసింది ప్రభుత్వం. ఒక్కసారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు. అంత ఈజీగా ఐదు నిమిషాల్లోనే తినేందుకు రెడీగా ఉండే వేరే ఫుడ్డు లేకపోవడం వల్ల ఇల్లాళ్లంతా గిజగిజలాడిపోయారు. లేటెస్టుగా పోర్న్‌ వెబ్‌ సైట్ల ను బ్యాన్‌ చేయడం పెనుదుమారమే రేపింది. దేశ వ్యాప్తంగా ఉన్న యూత్‌ విలవిలలాడిపోయే సన్నివేశమిది.

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై రామ్‌గోపాల్‌ వర్మ అంతెత్తున శ్వేతనాగులా విరుచుకుపడ్డాడు. ఇలా చేస్తే యూత్‌ బాగుపడతారా? ఇదెక్కడి అన్యాయం అని గొంతెత్తాడు వర్మ. ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం శృంగారంలో చెత్త పోకడలను తగ్గిస్తుందనడంలో సందేహమే లేదు. ముఖ్యంగా టీనేజర్ల మొబైళ్ల లో సెక్స్‌ క్లిప్పుల బెడద తగ్గుతుంది. ఇప్పటికే బోలెడన్ని డౌన్‌ లోడ్‌ చేసుకున్నవారికి అవే ఇక అర్థం పరమార్థం.

అయితే ఇదంతా బాగానే ఉంది. మరి కథానాయికల ఓవర్‌ ఎక్స్‌ పోజింగ్‌ ని బ్యాన్‌ చేసేదెప్పుడు? దీనివల్ల యువతరం మతిచెడి పిచ్చెక్కి ఏదేదో అయిపోతున్నారే అంటున్నారు యాక్టివిస్టులు. సినిమాల్లోకి శృతి మించిన శృంగారం పెనుప్రమాం. అయినా ఈరోజుల్లో పాశ్చాత్య ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షాత్తు దీపిక, అలియా, కంగనా వంటి స్టార్ హీరోయిన్లు తమ ఓవర్ ఎక్స్ పోజింగ్ తో చంపేస్తున్నారు. కొన్ని సినిమాలైతే మరీ డీ-గ్రేడ్‌ శృంగారంతో కథానాయికల అతితో చంపేస్తున్నాయి. కాబట్టి తొందర్లోనే ఎక్స్‌ పోజింగ్‌ని కూడా నిషేధిస్తారేమో చూడాలి.