యంగ్ హీరోకి మొహం చాటేస్తున్న భామలు

Wed Apr 19 2017 20:16:33 GMT+0530 (IST)

కొన్నేళ్ల క్రితం ఈ కుర్రాడు భలే క్రేజీ. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన లేటెస్ట్ జనరేషన్ హీరోలు.. హీరోయిన్లతో మాంచి టీం ఏర్పాటు చేసేశాడు. అందరూ కలిసి తెగ చక్కర్లు కొట్టేసేవాళ్లు.. పార్టీలు చేసేసుకునే వారు. ఈ టీంతో పాటు తిరిగేందుకు అప్పటికే కుదురుకున్న హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు.

కానీ రోజులు మారాయి. పరిస్థితులు మారాయి.. పొజిషన్స్ మారాయి. ఇప్పుడు ఇతనితో కలిసేందుకు చాలామంది ఉత్సాహం చూపడం లేదు. ముఖ్యంగా అప్పటి కొత్త.. ఇప్పటి స్టార్ హీరోయిన్స్ అయితే మరీ మొహం చాటేస్తున్నారట. చాలాసార్లు ఫోన్ కూడా ఎత్తడం లేదట. రీసెంట్ ఓ భామ అయితే.. ఫోన్ లిఫ్ట్ చేసి మరీ.. తను అవుటాఫ్ స్టేషన్ అంటూ నమ్మబలికిందని అంటున్నారు. తీరా ఓ గంట సమయానికే ఓ స్టార్ హోటల్ లో ఇతనికి ఎదురపడే సరికి.. స్థాణువై పోయిన ఆమె మొహం పక్కకు తిప్పుకుని చెక్కేసిందట.

కొన్నేళ్లుగా ఈ కుర్రాడు హిట్ మొహం చూడకపోవడం.. ఈ సమయంలో ఆ అమ్మాయిలు స్టార్ హీరోయిన్స్ రేంజ్ కి చేరుకోవడం జరిగిపోయాయి. కానీ ఇంతకీ ఈ కుర్రాడిని ఇంతలా దూరం పెట్టడానికి కారణం.. వాళ్ల రేంజ్- స్టేటస్ కాకపోవడమే అసలైన విషయం. ఈ మధ్య ఈ యంగ్ హీరో తెగ ఫేవర్స్ అడుగుతున్నాడట. అందుకే మిగిలిన వాళ్లంతా దూరంగా ఉంటున్నారని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/