Begin typing your search above and press return to search.

హీరోయిన్ల సైడ్‌ ఇన్‌ కం కథా కమామీషు

By:  Tupaki Desk   |   30 Aug 2015 8:12 AM GMT
హీరోయిన్ల సైడ్‌ ఇన్‌ కం కథా కమామీషు
X
కోట్లలో రెమ్యునరేషన్‌ అందుకుని సెలబ్రిటీ హోదాని కొనసాగించే హీరోయిన్లకు ఉన్నట్టుండి సినిమాల్లేకపోతే పరిస్థితి ఏమైపోతుంది? వ్యక్తిగత స్టాఫ్‌ ని మెయింటెయిన్‌ చేయాలన్నా, అసిస్టెంట్లకు జీతాలిచ్చి పోషించాలన్నా, అందాన్ని కాపాడుకోవాలన్నా బోలెడంత ఖర్చవుతుంది. లక్షల్లో వెచ్చిస్తేనే ఇవన్నీ సాధ్యం. స్టార్‌ హీరోయిన్ల మాటేమో కానీ, ఛోటా మోటా హీరోయిన్లకు పైకం ఎలా వస్తుంది? అంటే దానికో చిట్కా ఉందన్న సంగతి ఎందరికి తెలుసు?

కథానాయికగా వచ్చిన ఫేమ్‌ ని, గుర్తింపుని క్యాష్‌ చేసుకునే తెలివితేటలు ఉండాలే కానీ, చిన్న చిన్న హీరోయిన్‌ లు కూడా బాగానే ఆర్జించే అవకాశం ఉంది. షాపుల ఓపెనింగులు, రిబ్బను కటింగులు ఓవైపు అవార్డు ఫంక్షన్ లలో డ్యాన్స్‌లతో ఉర్రూతలూగించడం, పండగలు పబ్బాలకు వేదిక లెక్కి డ్యాన్సులు వేయడం ఇలాంటి వాటితోనే బోలెడంత సంపాదన ఉంటుంది. అదే అమెరికా, దుబాయ్‌ లాంటి చోట సెలబ్రేషన్స్‌ కి ఎటెండ్‌ అయితే వచ్చేది డబుల్‌, త్రిపుల్‌ ఉంటుంది.

ఇటీవలి కాలంలో దుబాయ్‌ లో జరిగిన సైమా వేడుకల్లో కనిపించిన నాయికల్లో మెజారిటీ భాగం సినిమాల్లేక ఖాళీగా ఉన్నవాళ్లే. అయినా వీళ్లంతా అక్కడ మెరుపులు మెరిపించారు. ఒక్కో షోకి 4 లక్షల నుంచి 8లక్షల వరకూ గుంజేస్తున్నారుట. సైమా, సినీ 'మా', సంతోషం, గామా, మిర్చి ఇలా అవార్డు వేడుకలు బోలెడన్ని. ఇవన్నీ ఆదాయాన్ని తెచ్చి పెట్టేవే.