నటి పొరపాటుతో సెక్స్ రాకెట్ బయటపడిందిలా..

Sat Jun 16 2018 17:01:40 GMT+0530 (IST)

అమెరికాలో ఎన్నో ఏళ్లుగా గుట్టుగా జరుగుతున్న సెక్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు. కిషన్ చంద్ర అనే దంపతులు టాలీవుడ్ హీరోయిన్లను ఈవెంట్స్ పేరు చెప్పి తాత్కాలిక వీసాలతో అమెరికా తీసుకొచ్చి చేయిస్తున్న వ్యభిచారం వెలుగు చూసింది. ఈ సెక్స్ రాకెట్ తో మొత్తం టాలీవుడ్ ఉలిక్కిపడింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కిషన్-చంద్రకళ చేసిన ఈ చిన్న తప్పే వారిని దొరికిపోయేలా చేసింది.అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాల పేరుతో లెటర్ హెడ్స్ ను కిషన్-చంద్రలు తయారు చేస్తారు. వాటితో ప్రోగ్రామ్స్ జరుగుతున్నట్లుగా కలరింగ్ ఇస్తారు. ముందుగా మాట్లాడుకున్న తారలకు వీసా ఇప్పించి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కొందరినీ..  ప్రదర్శనలు ఇవ్వడానికి మరికొందరినీ.. ఇక అతిథులుగా ఇంకొందరిని ఆహ్వానిస్తూ వారికి లెటర్ లు పంపిస్తారు.

వీటిని పట్టుకొని ఇండియా నుంచి తారలు వస్తారు. ముందుగా అనుకున్న డీల్ ప్రకారం విటులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. అనంతరం కిషన్ దంపతులు ఇచ్చిన మొత్తాన్ని పట్టుకొని ఇండియాకు తిరిగి వస్తారు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతోంది. చాలా మంది హీరోయిన్లను ఇలానే ఇండియా నుంచి రప్పించి విటులతో ఎంజాయ్ చేయించి వారి డబ్బులు ముట్టజెప్పి కిషన్-చంద్ర దంపుతులు పంపిస్తుంటారు.

2017 నవంబర్ 8న ఓ నటి చేసిన తప్పు ఇప్పుడు కిషన్ దంపతులను దొరికిపోయేలా చేసింది. కాలిఫోర్నియాలో నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమంలో పాల్గొనడానికి కిషన్ దంపతులు ఈ నటికి లెటర్ పంపారు. ఈవెంట్ నిర్వాహకుల లేఖ ఆధారంగా వీసాతో ఆమెరికాకు ఆ నటి వచ్చింది. అయితే అనుకున్న సమయానికి కాకుండా రెండు రోజులు ఆలస్యంగా వచ్చేసింది. స్టార్ నైట్ కార్యక్రమం ముగిసి రెండు రోజులు కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కాలిఫోర్నియా నుంచి చికాగోకు ఆ నటి పోవడంతో వారి  అనుమానం రెట్టింపైంది.

సదురు నటిపై పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా తాను త్వరలో ‘ఇల్లినాస్ రాష్ట్రంలోని స్కాంబర్గ్ లో నిర్వహించే కార్యక్రమానికి తాను హాజరు కావాల్సి ఉందని’ చెప్పింది. సదుదు పోలీసులు ఈవెంట్ నిర్వాహకులను సంప్రదించారు. అసలు ఆరోజు ఎలాంటి కార్యక్రమం తాము నిర్వహించడం లేదని వారు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ నటిని వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రశ్నించగా.. కిషన్ దంపతుల సెక్స్ రాకెట్ బయటపెట్టింది. ఆ వివారాల ఆధారంగా పోలీసులు లోతుగా పరిశోధించి కిషన్-చంద్రల సెక్స్ రాకెట్ ను కదిలించారు.