వెంకటేష్ తో నిర్మాతలకు కొత్త చిక్కులు!

Thu Jul 12 2018 16:30:41 GMT+0530 (IST)

`గురు` సినిమాతో హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి వెంకీ చేస్తోన్న మల్టీ స్టారర్ `ఎఫ్ 2` పట్టా లెక్కింది. ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తోంది. అయితే ఇపుడు తాజాగా వెంకీకి ఓ కొత్త చిక్కు వచ్చిపడింది. తన మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ నటిస్తోన్న `వెంకీ మామ` చిత్రంలో...వెంకీకి హీరోయిన్ ను వెతకడం కోసం నిర్మాత సురేష్ బాబు నానా తిప్పలు పడుతున్నారట. వెంకీ సరసన నటించేందుకు సూట్ అయ్యే హీరోయిన్ కోసం అన్నయ్య సురేష్ బాబు తెగ గాలిస్తున్నారట. అయితే వెంకీ సరసన నటించే హీరోయిన్ల జాబితా చాలా చిన్నదిగా ఉండడంతో ఆ సెర్చ్ కొంచెం కష్టంగా ఉందట.ప్రస్తుతం టాలీవుడ్ లోని సీనియర్ హీరోలలో ఒకరైన వెంకీ సరసన హీరోయిన్లను వెతకడం ఆయా చిత్ర నిర్మాతలకు కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది. `వెంకీ మామ`లో చైతూ సరసన రకుల్ ఫిక్స్ అయింది. అయితే వెంకీ పక్కన హీరోయిన్ కోసం మాత్రం సురేష్ బాబు తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారట. `ఎఫ్ 2`లో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది కాబట్టి ....నెక్స్ట్ మూవీలో ఆ కాంబో రిపీట్ చేయడం కష్టం. అనుష్క కొత్తగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. నయనతార  - అమలాపాల్ లు ఓ పట్టాన ఒప్పుకోవడం లేదు. వెంకీమామ పట్టాలెక్కేందుకు మరో 40 రోజుల గ్యాప్ ఉంది. సో ఈ లొపు కాజల్ నో - శ్రియా నో లేదంటే మరెవన్నా హీరోయిన్ నో సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏ ఆప్షన్ లేకుంటే తమన్నా తో సరిపెట్టుకున్నా ఆశ్యర్యం లేదు. అయితే వెంకీ మామ కథ ప్రకారం వెంకీ హీరోయిన్ క్యారెక్టర్ కు ప్రాధాన్యత లేదట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రం హీరోయిన్ కనిపించి వెళ్లిపోతుందట