Begin typing your search above and press return to search.

హీరోయిన్ పాత్రలు ఇంతేనా బాసూ

By:  Tupaki Desk   |   22 Jun 2017 5:12 AM GMT
హీరోయిన్ పాత్రలు ఇంతేనా బాసూ
X
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్ కు పర్ఫెక్ట్ పాత్రలు అంతగా కనిపించవు. హీరోయిన్ పాత్రకు సొంతగా వ్యక్తిత్వం ఉండే.. ఆనంద్.. పెళ్లి చూపులు లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. మధ్యలో కూడా కొన్ని సినమాలు ఉంటాయి కానీ.. తమ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్ అని మేకర్స్ చెప్పినా.. సినిమాలో మాత్రం ఆ పాత్ర తీరు విభిన్నంగా ఉంటోంది. హీరోయిన్స్ కూడా ఆ పేస్ కొనసాగించడంలో ఫెయిల్ అవుతున్నారు.

పెళ్లిచూపులుతో తన మార్క్ చూపించిన రీతు వర్మ.. తన తర్వాతి సినిమా కేశవలో స్ట్రాంగ్ రోల్ చేయలేకపోయింది. ఈ మూవీలో ఉండే లోటు.. హీరో-హీరోయిన్స్ లవ్ ట్రాక్ అంటే ఆశ్చర్యం వేయక మానదు. రారండోయ్ వేడుక చూద్దాం మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన భ్రమరాంబ పాత్రపై చాలానే మాటలు చెప్పారు. మేకర్స్ చెప్పినట్లుగానే రకుల్ పాత్ర ప్రారంభమైన తీరు బాగానే ఉంటుంది. అయితే.. ఉన్న కొద్దీ ఈ పాత్ర తీరు.. మరీ ఎక్కువ అరుపులతో నిండి.. ఆరెంజ్ లో జెనీలియా చేసినట్లుగా హంగామా చేసినట్లు కనిపిస్తుంది. స్ట్రాంగ్ కేరక్టర్ అంటే.. అరుపులు కేకలు పెట్టేయడం అనే టైపులో మార్చేశారు రైటర్స్.

జెంటిల్ మ్యాన్ మూవీలో నివేదా థామస్ కు అంత మంచి రోల్ రాసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. తన రీసెంట్ మూవీ అమీ తుమీలో ఇద్దరు హీరోయిన్స్ ఈషా రబ్బా.. అదితి మ్యాకల్ ఉన్నా.. ఒక్కరికీ సరైన పాత్ర అందించలేకపోయాడు. వీరికూడా ఎప్పుడూ అరుస్తూనే ఉంటారు. తండ్రి చేతిలోనో.. హీరోపైనో ఆధారపడకుండా.. తమ జీవితంపై తాము నిర్ణయించుకోగలిగే సత్తా ఉన్న పాత్రలను టాలీవుడ్ లో మళ్లీ ఎప్పుడు చూస్తామో!