Begin typing your search above and press return to search.

చెన్న‌య్ పై రౌడీ స‌మ్మోహ‌నం

By:  Tupaki Desk   |   17 Feb 2019 6:33 AM GMT
చెన్న‌య్ పై రౌడీ స‌మ్మోహ‌నం
X
ఒక స్టార్ ని పిచ్చిగా ప్రేమించ‌డం అన్న‌ది అభిమానుల ప‌ని. ఎంత‌గా ప్రేమిస్తే, ఎంత‌గా ఆరాధించి అభిమానిస్తే అంత‌గా ఆ స్టార్ కి పాపులారిటీ ఉన్న‌ట్టు. మోస్ట్ డిజైర‌బుల్ జాబితాలో అలాంటి స్టార్ల‌ను చేర్చ‌వ‌చ్చు. ప్ర‌ఖ్యాత చెన్న‌య్ టైమ్స్ తాజాగా వెలువ‌రించిన జాబితాలో మ‌న దేవ‌ర‌కొండ చోటు ద‌క్కించుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. అస‌లు ఈ రౌడీ కొండ చెన్న‌య్ పై అంత‌గా స‌మ్మోహ‌నం అనే మ‌త్తును చ‌ల్లాడా? అంటే అవున‌నే యూత్ ఓటింగ్ డిక్లేర్ చేసింది.

చెన్న‌య్ టైమ్స్ ప్ర‌క‌టించిన మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో టాప్ 20లో టాప్ 3 స్థానాన్ని దేవ‌ర‌కొండ సొంతం చేసుకున్నాడు. యువ‌సంగీత సంచ‌ల‌నం.. కొల‌వెరిడి ఫేం అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఒక‌టో ర్యాంక్ ను అందుకోగా, దేవ‌ర‌కొండ మూడో ర్యాంకులో నిలిచారు. ధ‌నుష్, శింబు, సూర్య వంటి స్టార్లు ఉన్న జాబితాలో దేవ‌ర‌కొండ చోటు ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మ‌న నైజాం మెగాస్టార్ కి చెన్న‌య్ లో అంత‌టి గుర్తింపు ద‌క్క‌డం ప్ర‌శంసించ‌ద‌గిన‌దే.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలు చెన్న‌య్ లో బంప‌ర్ హిట్ కొట్టాయి. ఆ క్ర‌మంలోనే అత‌డి క్రేజు అంత‌కంత‌కు పెరిగింది. ఆ త‌ర్వాత రిలీజైన నోటా ఫెయిలైనా చెన్న‌య్ వ‌సూళ్లు ఫ‌ర్వాలేద‌నిపించాయి. దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్ లో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఓవ‌రాల్ గా దేవ‌ర‌కొండ‌కు చెన్న‌య్ మెట్రో న‌గ‌రంలో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంద‌ని ప్రూవ్ అయ్యింది. మునుముందు తెలుగు- త‌మిళ్ ద్విభాషా చిత్రాల‌తో త‌న ఇమ‌జ్ ని మరింత పెంచుకునే ప్లాన్ లో ఉన్నాడు.