Begin typing your search above and press return to search.

అబ్బా.. విజయ్‌ ఫ్యాన్సుకు పండగే

By:  Tupaki Desk   |   25 Nov 2015 12:30 PM GMT
అబ్బా.. విజయ్‌ ఫ్యాన్సుకు పండగే
X
తెరి.. అంటున్నాడు పవర్‌ ఫుల్‌ హీరో విజయ్‌. ఎప్పుడైతే విజయ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ''పులి'' సినిమా ఫ్లాప్‌ అయ్యిందో.. అప్పటినుండి అభిమానులు ఎప్పుడెప్పుడు కొత్త సినిమా గురించి డిటైల్స్‌ బయటపెడతాడా అని చూస్తున్నారు. కాకపోతే విజయ్‌ మాత్రం ఇన్నాళ్ళూ సైలెంటుగా పని చేసుకుంటూ పోయాడు.

ఇకపోతే విజయ్‌ 59వ రూపొందుతున్న సినిమాను గతంలో 'రాజా రాణి' సినిమాతో డైరక్టర్‌ గా తొలి సినిమానే బ్లాక్‌ బస్టర్‌ తీసి తన టాలెంటును ప్రూవ్‌ చేసుకున్న అట్లీ డైరక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాకు తెరి అని నామకరణం చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను ఈరోజు సాయంత్రమే రిలీజ్‌ చేశారు. పోస్టర్లు యథావిథిగా కొత్తగా ఉండేలా చూసుకున్నాడు విజయ్‌. ఒక పోస్టర్ లో అయితే ఏకంగా మూడు రకాల రోల్స్‌ పోషిస్టున్నట్లు డిజైన్‌ చేశారు. ఒక క్యారెక్టర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అనుకుంట. అభిమానులు మాత్రం ఈ లుక్‌ రిలీజ్‌ అయిన మరుక్షణం నుండి పండగ చేసుకుంటున్నారంతే.

పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ మూవీగా రూపొందుతున్న ఈ 'తెరి'లో హీరోయిన్లుగా సమంత - యామీ జాక్సన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.