Begin typing your search above and press return to search.

ట్రీట్‌ మెంట్‌ కోసం అక్కడకు వెళ్లిన వెంకీ

By:  Tupaki Desk   |   24 Jan 2019 6:51 AM GMT
ట్రీట్‌ మెంట్‌ కోసం అక్కడకు వెళ్లిన వెంకీ
X
దాదాపు దశాబ్ద కాలం తర్వాత వెంకటేష్‌ తనదైన మార్క్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పదేళ్లు తాను చేసిన సినిమాలు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్‌ టైన్‌ చేయలేక పోయాయి. ఎట్టకేలకు 'ఎఫ్‌ 2' చిత్రం తనకు తృప్తినిచ్చిందని వెంకీ ఇటీవలే చెప్పుకొచ్చాడు. వరుణ్‌ తేజ్‌ తో కలిసి నటించిన వెంకీ 'ఎఫ్‌ 2' మొత్తంను తన భుజాలపై వేసుకుని నడిపించాడు. భార్య బాధితుడి పాత్రలో వెంకీ నవ్వించాడు. ఎఫ్‌ 2 చిత్రంతో వెంకీ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఆయన అభిమానులు సంతోషంగా ఉన్నారు.

వెంకటేష్‌ తదుపరి చిత్రం విషయంలో గత కొన్ని రోజులుగా పలు రకాల వార్తలు వస్తున్నాయి. తదుపరి చిత్రం ఏమో కాని ప్రస్తుతం వెంకటేష్‌ విశాఖపట్నంలో నేచురల్‌ క్యూర్‌ ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటున్నాడట. దాదాపు మూడు వారాల పాటు అక్కడ ట్రీట్‌ మెంట్‌ ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఇద్దరు ముగ్గురు సీనియర్‌ స్టార్‌ హీరోలు కూడా అక్కడ ట్రీట్‌ మెంట్‌ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా వెంకటేష్‌ కూడా ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటున్నాడు.

వెంకీ ఏ సమస్య గురించి ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటున్నాడనే విషయంపై క్లారిటీ అయితే లేదు, కాని రాబోయే సినిమాల్లో మరింత ఉత్సాహంగా వెంకీ కనిపిస్తాడనే నమ్మకంను మాత్రం సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ 2కు కొనసాగింపుగా 'ఎఫ్‌ 3' చిత్రం రాబోతుంది. ఆ చిత్రం కూడా తప్పకుండా వెంకీ కెరీర్‌ లో మరో నిలిచి పోయే సినిమా అవుతుందని అప్పుడే నమ్మకంగా చెబుతున్నారు. మొదటగా మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' చేసేందుకు వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ఆ తర్వాత సినిమాలు ఏముంటాయో చూడాలి.