Begin typing your search above and press return to search.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో!?

By:  Tupaki Desk   |   16 Jan 2018 11:59 AM GMT
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో!?
X
మన టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరో లకి పెళ్లిళ్లు అయిపోయాయి. కొంత మందికి పిల్లలు కూడా ఉన్నారు. అలానే ఇంకా పెళ్లి చేసుకోకుండా సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టిన హీరోలు కూడా ఉండనే ఉన్నారు. అందులో ప్రభాస్ - రానా మరికొందరి పేర్లు బాగా వింటూ ఉంటాం. కానీ ప్రభాస్ కి ముందే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి లవర్ బాయ్ గ కొన్నాళ్ళు స్టార్ స్టేటస్ ను అనుభవించి ఇప్పటికి పెళ్లి కాకుండా ఉన్న హీరో ఒకరున్నారు అని మీకు గుర్తుందా? అదేనండి మన తరుణ్.

భక్త ప్రహ్లాద లో మన తెలుగు ప్రేక్షకులని అలరించి చిరకాలం అలానే నిలిచిపోయిన రోజా రమణి గారి కొడుకుగా తరుణ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆదిత్య 369 వంటి సూపర్ హిట్ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గ నటించి నువ్వే కావాలి సినిమా తో హీరోగా అరంగేట్రం చేసాడు తరుణ్. 20 కి పైగా సినిమాలలో హీరోగా నటించి లవర్ బాయ్ గా పేరు కూడా పొందాడు. కానీ ఈ 35 ఏళ్ళ హీరో ఇప్పటికి బ్రహ్మచారి గానే మిగిలిపోయాడు. పెళ్లి గురించి ఎప్పుడు అడిగిన ఇంకా టైం ఉంది అంటూ ప్రశ్న ని దాటేస్తూ వస్తున్నాడు తరుణ్. కానీ రోజారమణి ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం.. త్వరలో పెళ్లి కబురు చెప్తాం అని చెప్పేసారు.

కెరీర్ మొదటిలోనే బోల్డు హిట్లు కొట్టిన తరుణ్ తర్వాత స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకోలేకపోయాడు. మార్కెట్ బాగా తగ్గిపోవడం తో సినిమాలకు కొంత దూరంగా ఉండిపోయాడు. కానీ మళ్ళీ ఇప్పుడు 'ఇది నా లవ్ స్టోరీ' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే కానుకగా రాబోతోంది. మరి ఈ హీరో కి పెళ్లి గడియలు ఎప్పుడు వస్తాయో చూద్దాం..