Begin typing your search above and press return to search.

మెచ్యూరిటీ లేకపోవడం వల్లనే క్యాస్టింగ్ కోచ్!

By:  Tupaki Desk   |   21 Jan 2019 5:42 AM GMT
మెచ్యూరిటీ  లేకపోవడం వల్లనే క్యాస్టింగ్ కోచ్!
X
క్యాస్టింగ్ కోచ్ అంశం తరచుగా ఎదో ఒక రూపంలో వార్తల్లో ఉంటూ వస్తోంది. ఈమధ్యే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానిపై 'సంజు' చిత్రానికి పనిచేసిన మహిళా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దాదాపుగా హీరాని సినిమాలన్నీ ఏదో ఒక సామాజిక సందేశంతో కూడి ఉంటాయి.. ఆలాంటి దర్శకుడిపై ఆరోపణలకు రావడం బాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది.

ఈ క్యాస్టింగ్ కోచ్ టాపిక్ పై ఎప్పుడు భిన్న అభిప్రాయలు వెల్లడవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ హీరో సుమన్ ఈ అంశంపై ఘాటు కామెంట్లు చేశారు. తమ జెనరేషన్లో క్యాస్టింగ్ కోచ్ లేదని.. ఎందుకంటే అందరూ యాక్టర్లు చాలా ప్రతిభావంతులని.. అడ్డదారుల్లో అవకాశాలు తెచ్చుకోవాల్సిన అవసరం వారికి ఉండేది కాదన్నారు. కానీ ఈ జెనరేషన్ యాక్టర్లలో సమస్య ఏంటంటే కళ్ళు మూసి తెరిచేలోపు హీరోయిన్ అవ్వాలని .. స్టార్ అవ్వాలనే ఆలోచన ఉంటుందని.. అది కాకుండా టాలెంట్ కూడా లేకపోవడంతో ఇలాంటి షార్ట్ కట్ దారులు వెతుక్కుంటున్నారని అన్నారు. నిజంగా టాలెంట్ ఉంటే క్యాస్టింగ్ కోచ్ డిమాండ్లకు తల వంచే పరిస్థితి ఉండదని అన్నారు. క్యాస్టింగ్ కోచ్ కు రెడీకావడం వారికి మెచ్యూరిటి లేకపోవడం వల్లనే అని తేల్చేశారు.

మరో సీనియర్ హీరో అర్జున్ పై ఈ లైంగిక ఆరోపణల అంశం ప్రస్తావిస్తే "నాకు ప్రూఫ్ చూపించండి. అప్పుడే నమ్ముతా" అని ఘాటు సమాధానం ఇచ్చాడు. క్యాస్టింగ్ కోచ్ పై ఇలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన హీరో సుమన్ మాత్రమే. సుమన్ చెప్పేదాన్లో కూడా లాజిక్ ఉంది కదా. ఈ ఆర్టికల్ చదువుతున్న మిమ్మల్ని ఎవరైనా ఒక 'సుందరి' వచ్చి నన్ను అక్కడ పట్టుకున్నాడు.. ఇక్కడ నొక్కాడు.. ఎక్కడో గిల్లాడు అని "ప్రూఫులు చూపించకుండా" ఆరోపణలు చేస్తే ఏం చేస్తారు?