Begin typing your search above and press return to search.

సెక్సీగా ఉంది కాని.. బూతు కాదండీ..

By:  Tupaki Desk   |   3 Dec 2016 7:30 PM GMT
సెక్సీగా ఉంది కాని.. బూతు కాదండీ..
X
ఇప్పటికే మనం ఆల్రెడీ 'నీ సొంతం' పాటలో యాంకర్ రష్మి అందాలు ఎంత పనిచేశాయో చూశాం. సెక్స్ సెల్స్ అనే చందంగా ఈ పాటను ఏకంగా ఒక్క సంవత్సరంలో 2.1 కోట్ల మంది వీక్షించేశారు. అయితే ఇక్కడే ఒక విషయం చెబుతున్నాడు ఆ పాటలో నటించిన హీరో సిద్దూ. మనోడు ఆ పాట హిట్ క్రెడిట్ అంతా 'సెక్స్ సెల్స్' అనే కామెంట్ ఖాతాలో వేయకూడదు అంటున్నాడు.

''నిజానికి ఆ పాటలో చాలా సెక్సీనెస్ ఉంది. రష్మి ఎంత హాటుగా కనిపించాలి అనే విషయంపై చాలా వర్కవుట్ చేశాం. అయితే ఆ పాటలో బూతు లేదు. మీకు ఎక్కడా కూడా పాట కాని.. విజువల్స్ కాని వల్గర్ గా అనిపించవు. సెక్సీగా కనిపించడం.. అలాగే బూతుకు చాలా తేడా ఉంది. అది తెలుసుకుని సినిమాలు తీసినా పాటలు తీసినా కూడా ఖచ్చితంగా హిట్టవుతాయి'' అంటున్నాడు సిద్దూ.

సర్లేండి.. 2.1 కోట్లు హిట్లు వచ్చాక.. ఆ క్రెడిట్ అంతా కేవలం రష్మి ఖాతాలో వేస్తాం అంటే ఎలా.. కాస్త మన హీరో ఖాతాలో కూడా వేయండి. అలాగే దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఖాతాలో కూడా వేయాల్సిందే. అదేగా వీళ్ళు చెప్పే లాజిక్?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/