Begin typing your search above and press return to search.

ఈ న్యూడ్ వేషాలేంటి? హీరోకి చీవాట్లు!

By:  Tupaki Desk   |   15 Feb 2019 4:38 PM GMT
ఈ న్యూడ్ వేషాలేంటి? హీరోకి చీవాట్లు!
X
సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో పిచ్చి పీక్స్ కి చేరుతోంది. ప్ర‌యివేట్ జీవితం ప‌బ్లిక్ అయిపోతోంది. కొంద‌రు తెలిసో తెలియ‌కో.. మ‌రికొంద‌రు కావాల‌నో ఆ ప‌ని చేస్తున్నారు. వ్య‌క్తిగ‌త స‌మాచారం బ‌య‌టి ప్ర‌పంచానికి లీక్ చేస్తూ .. న్యూడ్‌ ఫోటోల్ని .. బెడ్ రూమ్ ఫోటోల్ని య‌థేచ్ఛ‌గా షేర్ చేసేస్తూ త‌మ‌కు ప్ర‌చారం కోరుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి ప‌రాకాష్ట వ్య‌వ‌హారంలో అందాల క‌థానాయిక‌లు త‌క్కువేమీ కాద‌నేందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.

లేటెస్ట్ గా ఓ యంగ్‌ హీరో త‌న భార్య తో క‌లిసి అర్థ‌న‌గ్నంగా దిగిన ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అది కూడా పవిత్ర‌మైన ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ ఫోటోని షేర్ చేయ‌డంతో నెటిజ‌నులు చెల‌రేగిపోతున్నారు. భార్య అర్థ‌న‌గ్నంగా నిలుచుని ఉంది.. త‌న వెన‌క భాగంలో నిలుచుని ప్ర‌యివేటు పార్ట్స్ క‌వ‌ర్ చేస్తూ అత‌డు చేతిని అడ్డం పెడితే.. ఆ సెమీ న్యూడ్ వ్య‌వ‌హారాన్ని సెల్ఫీ తీస్తోంది స‌ద‌రు భార్యామ‌ణి. ఇంత‌కీ ఎవ‌రా హీరో అంటే బాలీవుడ్ యంగ్ హీరో ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్. అత‌డు ఇటీవ‌లే త‌న గాళ్ ఫ్రెండ్ సాన్యా సాగ‌ర్ ని పెళ్లాడాడు. ఇంతలోనే ఇలా త‌న‌తో క‌లిసి ప‌బ్లిసిటీ పిచ్చితో పైత్యం చూపిస్తున్నాడు అంటూ నెటిజనులు తిట్లు , చీవాట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఎంత ప‌బ్లిసిటీ పిచ్చి ఉన్నా ఇంత‌గానా? అంటూ ప‌ళ్లు నూరేస్తున్నారు.

పాపుల‌ర్ సెల‌బ్రిటీలు స్మితాపాటిల్-రాజ్ బబ్బర్ దంపతులు కుమారుడైన ప్రతీక్ ఇలా వాలంటైన్స్ డే రోజున ఇలా చేస్తాడా? అంటూ సోషల్ మీడియాలో దారుణమైన చీవాట్లు వెలుగులోకి వ‌చ్చాయి. ప్ర‌తీక్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ స్టార్. గ‌త ఏడాది `భాఘి 2` చిత్రంతో చ‌క్క‌ని హిట్ కొట్టాడు. ముల్క్, మిత్రోన్ చిత్రాల‌తోనూ మెప్పించాడు. 2019 లో మూడు చిత్రాల్లో న‌టిస్తూ బిజీ. చిచ్చోరే - బ్రహ్మాస్త్ర - యారామ్ వంటి క్రేజీ చిత్రాలు చేస్తున్నాడు. అత‌డు హీరోగా స‌క్సెస్ కాలేక‌పోయినా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా బాగానే రాణిస్తున్నాడు. ఈ టైమ్ లో ఇలా ప‌బ్లిసిటీ స్టంట్ కోసం ఇలా భార్య‌ను న‌గ్నంగా పందేరానికి పెట్ట‌డ‌మేంటో? అంటూ నెటిజ‌నం చిర్రెత్తిపోతున్నారు.