Begin typing your search above and press return to search.

శంక‌ర్ వార్నింగ్ ఎవ‌రిని ఉద్ధేశించి?

By:  Tupaki Desk   |   16 July 2019 6:43 AM GMT
శంక‌ర్ వార్నింగ్ ఎవ‌రిని ఉద్ధేశించి?
X
ఎన‌ర్జిటిక్ రామ్ ని మాస్ స్టైల్లో ఆవిష్క‌రిస్తూ పూరి తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` ఈనెల 18న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఊర‌ మాస్ .. ర‌గ్గ్ డ్ పాత్ర‌లో రామ్ న‌టిస్తే.. అత‌డితో పోటీప‌డుతూ క‌న్న‌డ బ్యూటీస్ నిధి అగర్వాల్.. నభా నటేష్ చెల‌రేగడంపై యూత్ లో ఇస్మార్ట్ టాక్ న‌డుస్తోంది. యంగ్ హాట్ బ్యూటీస్ ని పూరి అంతే మాస్ స్టైల్లో చూపించారు. అందుకే ఈ సినిమాకి ఓపెనింగుల ప‌రంగా క్రేజు నెల‌కొంద‌ని తెలుస్తోంది.

చాలా రోజుల త‌ర్వాత పూర్తి మాస్ సినిమాని చూపిస్తున్నాన‌ని పూరి ఇప్ప‌టికే ఇంట‌ర్వ్యూల్లో చెబుతున్నారు. అన్ని ప‌నులు పూర్త‌యిన ఈ చిత్రానికి బుధ‌వారం (17 జూలై) సాయంత్రం ప్రివ్యూలు వేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం `ఏ` స‌ర్టిఫికెట్ ని జారీ చేసింది. ఇక ఈ సినిమాలో మ‌రోసారి పూరి మార్క్ డైలాగుల‌కు కొద‌వే లేద‌న్న స‌మాచారం అందింది. అందుకే ఏ స‌ర్టిఫికెట్ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ పోకిరి-దేశ‌ముదురు-బిజినెస్ మేన్! చిత్రాల ప్ర‌స్థావ‌న‌ను తెచ్చింది చిత్ర‌బృందం. ఏ స‌ర్టిఫికెట్ తోనే హిట్ట‌యిన సినిమాలు అంటూ పూరి - ఛార్మి బృందం మా బాగానే ప్ర‌చారం చేశారు.

తాజాగా చిత్ర క‌థానాయ‌కుడు రామ్‌ ఆసక్తికర ట్వీట్ చేశారు. ``సినిమా మొద‌ల‌య్యే ముందు వేసే స్టాట్యూటరీ వార్నింగ్‌ తరహాలో ధూమపానం- మద్యపానం విష‌యంలో ఇస్మార్‌ శంకర్‌ లా నిజజీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్‌ శంకర్‌ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకోగలిగినంత ఇస్మార్ట్‌ గా వ్యవహరించండి`` అంటూ ట్వీట్‌ చేశారు. రామ్ ఇస్మార్ట్ ట్వీట్ ప్ర‌స్తుతం నెటిజ‌నుల్లోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది. పొగ తాగ‌డం.. మ‌ద్యం సేవించ‌డం.. డ‌బుల్ మీనింగ్ మాస్ డైలాగులు.. భారీ యాక్ష‌న్ ఇలా అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించాకే ఈ సినిమాకి ఏ స‌ర్టిఫికెట్ ని జారీ చేశార‌ని తెలుస్తోంది. ఇంత ప‌క్కాగా బ‌ల్ల గుద్ది `ఏ` ఇచ్చాక ఆ మాత్రం ఓపెనింగులు ఉండ‌డం స‌హ‌జం. అయితే తొలి వీకెండ్ త‌ర్వాతా వ‌సూళ్ల‌ను స్థిరంగా సాధించ‌గ‌లిగితేనే బ‌డ్జెట్లు రీక‌వ‌రీ అవ్వ‌డం సాధ్య‌ప‌డుతుంది. మ‌రి ఈ విష‌యంలో ఇస్మార్ట్ టీమ్ ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస‌వుతుంది? అన్న‌ది వేచి చూడాల్సిందే.