Begin typing your search above and press return to search.

ఎనర్జీ ఎక్కువ.. స్కిల్ మాత్రం తక్కువే

By:  Tupaki Desk   |   21 Oct 2016 11:05 AM GMT
ఎనర్జీ ఎక్కువ.. స్కిల్ మాత్రం తక్కువే
X
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్..మళ్లీ డీలా పడ్డాడు. నేను శైలజతో ట్రాక్ ఎక్కాడులే అనుకుంటే.. తిరిగి హైపర్ తో తన పాత రూట్ లోకి వచ్చేశాడు. రిలీజ్ కి ముందు మాస్ మసాలా పై క్వశ్చన్ చేస్తే.. అవే చేయడానికి పెద్ద సిద్ధాంతమే చెప్పాడు కానీ.. ఈ ఎనర్జిటిక్ హీరో అనుసరించే రూట్ కరెక్ట్ గా లేదని మాత్రం అర్ధం చేసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. రీమేక్ లను జడ్జ్ చేయడంలో రామ్ వేసిన తప్పటడుగులు చూస్తే.. ఈ విషయం అర్ధమవుతుంది.

మూడేళ్ల క్రితం మసాలా అని ఓ మూవీ చేశాడు రామ్. ఈ హీరో కెరీర్ లో ఇదొక్కటే రీమేక్. బాలీవుడ్ మూవీ బోల్ బచ్చన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. రామ్ కెరీర్ లో భారీగా నిరుత్సాహపరిచిన సినిమాల్లో ఒకటి. వెంకీతో కలిసి చేసిన కామెడీని కూడా జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే.. రామ్ మరో రెండు రీమేక్ లు కూడా చేయాల్సి ఉంది. వీఐపీ అనే తమిళ్ సినిమాని రైట్స్ కొనేసి మరీ స్రవంతి రవికిషోర్ అంటే.. ఈ స్టోరీ తెలుగోళ్లు రిసీవ్ చేసుకోరని ఒకే మాటతో తేల్చేసి పక్కనెట్టేసాడు. ఇదే సినిమా రఘువరన్ బీ టెక్ అంటూ వచ్చి ఇక్కడ కేకలు పుట్టించేసి.. ధనుష్ కి మార్కెట్ క్రియేట్ చేసింది.

తాజాగా రిలీజ్ అయి సక్సెస్ సాధించిన చైతు ముూవీ ప్రేమమ్ కి కూడా సేమ్ స్టోరీ. దీన్ని తెలుగులో చేసేందుకు మొదట ప్రయత్నించింది కూడా స్రవంతి రవికిషోరే. కానీ దీన్ని కూడా రామ్ తిరస్కరించడం.. ఇఫ్పుడు చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం చూస్తున్నాం. చూస్తుంటే.. రామ్ తన జడ్జిమెంట్ ల్ స్కిల్స్ ను తిరిగి పరిశీలించుకుని.. సీనియర్లు చెప్పేది వినడం బెటర్ అనిపించడం లేదూ.