Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరోకు ఫైన్‌ వేసిన టీ పోలీసులు

By:  Tupaki Desk   |   24 Jun 2019 12:33 PM GMT
యంగ్‌ హీరోకు ఫైన్‌ వేసిన టీ పోలీసులు
X
యంగ్‌ హీరో రామ్‌ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో 'ఇస్మార్ట్‌ శంకర్‌' దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తుది దశ చిత్రీకరణ జరుపుతున్నారు. చిత్రీకరణలో భాగంగా యూనిట్‌ సభ్యులు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. సీన్‌ చిత్రీకరణలో భాగంగా రామ్‌ సిగరెట్‌ తాగడం జరిగింది. అయితే చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో సిగరెట్‌ ను బహిరంగంగా తాగడం నిషేదం. ఆ విషయాన్ని పట్టించుకోని యూనిట్‌ సభ్యులు ఆ సీన్‌ ను చిత్రీకరించడం జరిగింది.

చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో సిగరెట్‌ పై ఉన్న నిషేదంను రామ్‌ అతిక్రమించినందుకు గాను తెలంగాణ పోలీసులు అతడికి ఫైన్‌ విధించారు. 200 రూపాయల ఫైన్‌ ను రామ్‌ చెల్లించినట్లుగా తెలుస్తోంది. కోప్టా యాక్ట్‌ 2003 సెక్షన్‌ 4 ప్రకారం కీలక ప్రాంతాలైన కొన్ని చోట్ల ఓపెన్‌ గా దుమపానం చేయడం నిషేదం. అందుకే రామ్‌ కు ఫైన్‌ వేయడం జరిగింది. ఈ ఫైన్‌ రామ్‌ కు పెద్ద సమస్య కాదు.. కాని ఇప్పుడు ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా వెళ్లడయ్యి తెగ వైరల్‌ అవుతోంది.

ఇక రామ్‌ సినిమా విషయాలకు వస్తే గత కొంత కాలంగా సక్సెస్‌ లేక అల్లాడి పోతున్నాడు. మరో వైపు పూరి జగన్నాద్‌ కూడా సక్సెస్‌ లు లేక ఢీలా పడిపోయాడు. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడంతో మరింత రిస్క్‌ చేశాడు. విభిన్నమైన గెటప్‌ లో రామ్‌ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.