'వాటమ్మా'.. భలే సమాధానాలమ్మా!!

Fri Oct 13 2017 11:42:57 GMT+0530 (IST)

సోషల్ మీడియా దయ వల్ల అభిమాన తారలకు కాస్త దగ్గరగా ఉండి ఎదో సంతోషాన్ని పొందవచ్చు. తారలు కూడా వారి సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితంలోని సంతోషాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వారు కూడా కొంచెం ఆనందాన్ని పొందుతారు. ఈ సోషల్ మీడియా రిలేషేన్ లో అప్పుడపుడు కొన్ని వైరల్ అయ్యే న్యూస్ లు బాగానే వస్తాయి అన్నది తెలిసిన విషయమే..అయితే రీసెంట్ గా హీరో రామ్  అభిమానులతో చేసిన ఒక ట్వీట్ కాన్వర్సేషన్ చాలా వైరల్ అయ్యింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు రామ్ క్యాచీ ఆన్సర్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఏదైనా అడగాలనుకుంటే వాటమ్మా అని ట్యాగ్ చేయండని చెప్పడంతో అభిమానులు ఆ స్టైల్ లోనే కొన్ని ప్రశ్నలను అడిగారు. సాంగ్ ఎప్పుడు పాడతారమ్మ మీరు? అంటే రామ్ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. హ..హ.. ఈ ప్రశ్నకు ఆన్సర్ నువ్వు ఎప్పటికి తెలుసుకోలేవ్ అని ఫన్నీ గా చెప్పాడు.

ఇక మరో వ్యక్తి మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నావు అంటే..అపారమైన సంతృప్తి ని పొందుతున్నా.. రేపు మీరు కూడా అలానే ఫీల్ అవుతారని చెప్పాడు. ఇక పెళ్లి ప్రస్తావనలో ఒక యువకుడు.. మీకు కాబోయే భార్య విషయంలో మీరు చూసే అతి ముఖ్యమైన లక్షణం ఏమిటని అడిగితే రామ్.. ఇంకా సింగిలేనమ్మా.. అంత డిటైల్డ్‌గా ఆలోచించలేదు.. కనెక్ట్ అవ్వాలి అని చెప్పాడు.

అయితే కనెక్ట్ అవ్వాలి అంటే మాట్లాడలిగా అనే మరో ప్రశ్నకు రామ్ మళ్లీ ఆన్సర్ ఇచ్చాడు. 'కదా! అందుకే ఇంకా సింగల్ అనే అనుకుంటా!' అని చెప్పడంతో అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం రామ్ ఉన్నది ఒక్కటే జిందగి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నుంచి రిసేంట్ గా విడుదలైన పాట 'వాటమ్మా.. వాట్ ఇజ్ దిస్సమ్మా' మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.