Begin typing your search above and press return to search.

నాని సరసన ఢిల్లీ భెల్లీ??

By:  Tupaki Desk   |   2 Sep 2015 5:31 PM GMT
నాని సరసన ఢిల్లీ భెల్లీ??
X
తెలుగు లో గంగ, తమిళంలో కాంచన ఒకేసారి రిలీజై హిట్‌ కొట్టాయి. ఈ రెండిటి లో కామన్‌ హీరోయిన్.. ఢిల్లీ బెల్లీ తాప్సీ జాక్‌ పాట్‌ కొట్టేసిందే అనుకున్నారంతా. ద్విభాషా చిత్రం హిట్‌ కొట్టడం తో ఇక క్షణం తీరిక లేనంత బిజీ అయిపోతుందనే భావించారంతా. కానీ అచ్చులో బొమ్మ అక్కడే తిరగబడింది. అసలు ఆశించిన స్థాయి లో ఛాన్సుల్లేక విలవిలలాడిపోతోంది అమ్మడు. ప్రస్తుతం తమిళ్‌ లో ఓ సినిమ చేస్తున్నా.. టాలీవుడ్‌ లో పిలిచి అవకాశం ఇచ్చే నాధుడే లేకపోయే.

అయితే సరిగ్గా ఇలాంటి టైమ్‌ లో హీరో నాని పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడు. నాని హీరో గా వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఓ కొత్త సినిమాలో తాప్సీ నాయిక గా ఎంపికైందని సమాచారం. నాని నటించిన భలే భలే మగాడివోయ్‌ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. దాంతో పాటే కొత్త సినిమా ఉంటుంది. అందులో తాప్సీ నాయిక గా నటిస్తుందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో తాప్సీ లుక్‌ మార్చేసింది. బాగా తిండి తగ్గించి జీరోసైజ్‌ లో కనిపిస్తోంది. మరీ బక్క చిక్కిన దేహశిరుల్ని ఫోటోషూట్‌ తీయించి ఆన్‌లైన్‌ లో ప్రచారానికి పెట్టింది. పాతమ్మాయిని కాను, కొత్తమ్మాయిని అన్నట్టే కలరింగ్‌ ఇస్తోంది. సైజ్‌ జీరో అయినంత మాత్రాన అనుష్క కాగలదా? ప్చ్‌.. తాప్సీ.