Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ అడ్డాల తో న్యాచురల్ స్టార్?

By:  Tupaki Desk   |   18 Oct 2018 7:27 AM GMT
శ్రీకాంత్ అడ్డాల తో న్యాచురల్ స్టార్?
X
ఫ్లాపులతో కెరీర్ ఎప్పుడూ తల్లకిందులు కాదు గానీ ఒక స్టార్ హీరోకి డిజాస్టర్ ఇస్తే మాత్రం డైరెక్టర్ కెరీర్ దారుణంగా మారిపోతుంది. 'బ్రహ్మోత్సవం' తర్వాత శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి దాదాపు అలానే ఉంది. అదేకనుక 'బ్రహ్మోత్సవం' హిట్ అయి ఉంటే ఈ పాటికి మరో హీరో శ్రీకాంత్ కు తప్పనిసరిగా డేట్స్ ఇచ్చి ఉండేవాడు. అలా జరగక పోవడంతో ఇప్పటివరకూ శ్రీకాంత్ సినిమా ఫైనల్ కాలేదు.

'బ్రహ్మోత్సవం' షాక్ నుండి కోలుకున్న తర్వాత శ్రీకాంత్ ఒక మంచి కథతో గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో అడుగు పెట్టాడు. తన కథతో వరుణ్ తేజ్ ను మెప్పించాడని 'ముకుంద' కాంబో మరోసారి రిపీట్ అవుతుందని అన్నారు. కానీ ఆ కాంబో వర్క్ అవుట్ కాలేదు. తర్వాత యువహీరోలు శ్రీవిష్ణు - శర్వానంద్ లతో ఒక మల్టిస్టారర్ కోసం కథ రెడీ చేశాడట. అది కూడా పట్టాలెక్కకపోవడంతో ఇప్పుడు ఆ కథను సోలో హీరో స్టొరీగా మార్చాడట.

దీంతో గీతా ఆర్ట్స్ వారు న్యాచురల్ స్టార్ నాని కోసం ట్రై చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'భలే భలే మగాడివోయ్' సినిమాతోనే నాని స్టార్ హీరో లీగ్ లోకి చేరిన సంగతి తెలిసిందే. దీంతో చాలా ఏళ్ళ తర్వాత మరోసారి నాని తో సినిమా చేయాలని చూస్తున్నారట. నాని కూడా ఈమధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలేవీ చెయ్యలేదు కాబట్టి శ్రీకాంత్ అడ్డాల కథకు ఓకే చెప్పే అవకాశం ఉందని టాక్.