లోకల్ కుర్రాడు కుమ్మేసుకుంటున్నాడు

Fri Feb 17 2017 23:25:50 GMT+0530 (IST)

యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోకల్ కి.. ఎక్కడా బ్రేక్ అనేదే పడడం లేదు. రిలీజ్ రోజు నుంచి ఇప్పటివరకూ స్టడీగా కలెక్షన్స్ వసూలు చేసుకుంటున్నాడు నాని. రెండో వారంలో 7 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ ను వసూలు చేయగలిగాడంటే.. నేచురల్ స్టార్ కి ఉన్న క్రౌడ్ పుల్లింగ్ పవర్ ఏంటో అర్ధమవుతుంది.

మొత్తం రెండు వారాలకు కలిపి నేను లోకల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 29.46 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే నాని కెరీర్ బెస్ట్ అయిన భలేభలే మగాడివోయ్ ను దాటేసిన నేను లోకల్.. కనీసం మరోవారం పాటు సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజాంలో 9.23 కోట్లు రాబట్టిందంతే ఈ మూవీ రేంజ్ అర్ధమవుతుంది. సీడెడ్ 2.7 కోట్లు.. నెల్లూరు 68 లక్షలు.. గుంటూరు 1.69 కోట్లు.. కృష్ణా 1.72 కోట్లు.. వెస్ట్ 1.28 కోట్లు.. ఈస్ట్ 2.03 కోట్లు.. ఉత్తరాంధ్రలో 3.37 కోట్ల వసూళ్లు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల్లో 22.7 కోట్ల షేర్ రాబట్టగా.. కర్నాటక నుంచి 2.05 కోట్లు.. యూఎస్ఏ 3.9 కోట్లు.. మిగిలి ప్రాంతాల నుంచి 80 లక్షలు వచ్చాయి.

మొత్తంగా నేను లోకల్ కి రెండు వారాల షేర్ 29.46 కోట్లు వచ్చేసింది. మరొక్క రోజుతో 30 కోట్ల మార్క్ అందుకుంటున్న నాని మూవీ నేను లోకల్ కు.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పెరుగుతున్నట్లు ట్రేడ్ జనాలు చెబుతున్నారు. కొత్త సినిమాలొచ్చినా.. లోకల్ కుర్రాడి సినిమా కలెక్షన్స్ కుమ్మేస్తుండడం విశేషం.