Begin typing your search above and press return to search.

హనుగాడి వీర ప్రేమగాధ.. మొదలైంది

By:  Tupaki Desk   |   27 Aug 2016 6:11 PM GMT
హనుగాడి వీర ప్రేమగాధ.. మొదలైంది
X
మరి మన నాని లీడ్ లో ''కృష్ణగాడి వీర ప్రేమగాధ'' అని తీశాడు.. అలాంటప్పుడు తను మూడు ముళ్ళు వేసి ఒక అమ్మాయిని తన భార్యను చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది అతని ప్రేమగాధ మొదలెట్టినట్లేగా. అందుకే ఇప్పుడు నాని అంటున్నాడు ''హనుగాడి వీర ప్రేమగాధ'' మొదలైంది అని.

''హనుగాడి వీర ప్రేమ గాథ బిగిన్స్. విషింగ్ యూ ఏ హ్యాపీ బ్లాక్ బూస్టర్ మ్యారీడ్ లైఫ్'' అంటూ ట్విట్ చేశాడు నాని. మొన్న శుక్రవారం (26న) సాయంత్రం దర్శకుడు హను రాఘవపూడి వివాహం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అమూల్యతో.. వైభవంగా జరిగింది. ఇది పెద్దలు కుదర్చిన వివాహమే అయినప్పటికీ.. మొన్ననే మే నెలలో ఎంగేజ్మెంట్ అయినప్పటినుండీ ఇద్దరి మధ్యనా చిగురించిన ప్రేమ మామూలుగా లేదట.

ఈ మధ్యనే దర్శకుడు క్రిష్‌ పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు హను రాఘవపూడి కూడా కానిచ్చేశాడు. చూస్తుంటే పెళ్లికాని దర్శకులందరూ వరుసగా క్యూ కట్టేసినట్లున్నారు. ఇకపోతే అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాలతో ఆకట్టుకున్న హను.. ఇప్పుడు తదుపరి సినిమాను అఖిల్ తో చేస్తాడని ముందులో వార్తలొచ్చినా.. ఆ సినిమాను నితిన్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది.