Begin typing your search above and press return to search.

నాని 'ఏ' జాబితాలోకి వచ్చేసినట్లేనా?

By:  Tupaki Desk   |   24 Nov 2017 6:10 AM GMT
నాని ఏ జాబితాలోకి వచ్చేసినట్లేనా?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ఫాంలో ఉన్న హీరో ఎవరు అని అడిగితే.. నాని అనే సమాధానమే వస్తుంది. ఇంకొందరు టాప్ స్టార్లు.. యంగ్ హీరోలు కూడా మంచి హిట్స్ సాధిస్తున్నా.. నాని ఉన్న ఫామ్ ను అందుకోవడం చాలా కష్టం. యావరేజ్ కంటెంట్ తో మంచి హిట్స్.. బ్లాక్ బస్టర్స్ సాధించేస్తూ సత్తా చాటుతున్న నాని 'ఏ' గ్రేడ్ హీరోల లిస్ట్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు.

ఏ గ్రేడ్ అంటే.. అడల్ట్ కంటెంట్ కాదండోయ్. మన న్యాచురల్ స్టార్ ఇలాంటి వాటికి చాలా చాలా దూరం. కేవలం ఫ్యామిలీ ఎంటర్టెయినర్లను మాత్రమే అందించే నాని.. అసలు వీటి జోలికే పోడు. టాప్ రేంజ్ స్టార్ హీరోలను.. గ్రేడ్ హీరోలుగా పరిగణించడం టాలీవుడ్ ఆనవాయితీ. ఇందులోకి నాని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం ఖాయంగా చెప్పచ్చు. భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ నుంచి రీసెంట్ గా నిన్నుకోరి వరకూ నాని నటించిన అన్ని సినిమాలు హిట్లే. మధ్యలో కృష్ణగాడి వీర ప్రేమగాధ.. మజ్నులు మాత్రం కాసింత యావరేజ్ గా నిలిచాయి.

కానీ కృష్ణగాడి వీర ప్రేమగాధ తర్వాత జెంటిల్ మ్యాన్ అంటూ.. మజ్ను తర్వాత నేను లోకల్ మూవీతో నాని బౌన్స్ బ్యాక్ అయిన తీరు అసమాన్యం. ఇప్పుడు నాని నటిస్తున్న ఎంసీఏ 35 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇందులో థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 25 కోట్లు కాగా.. శాటిలైట్ 6 కోట్లు.. డిజిటల్ ఫార్మాట్ లో 5.5 కోట్లు వచ్చాయట. తర్వాతి చిత్రాలతో నాని రేంజ్ 40 కోట్లు దాటిపోవడం ఖాయం. అప్పుడు కచ్చితంగా నాని ని స్టార్ హీరో అనాల్సిందే.