Begin typing your search above and press return to search.

పైల‌ట్ శిక్ష‌ణ‌కి వెళుతున్న కార్తీ

By:  Tupaki Desk   |   2 May 2016 4:19 AM GMT
పైల‌ట్ శిక్ష‌ణ‌కి వెళుతున్న కార్తీ
X
పెద్దాయ‌న మ‌ణిర‌త్నం కార్తీని ఓ కొత్త పాత్ర‌లో చూపించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యాడు. ఆకాశంలో విహ‌రించే పైల‌ట్‌ గా కార్తీ క‌నిపించ‌బోతున్నాడు. ఆ పాత్ర కోసం కార్తీ శిక్ష‌ణ కూడా తీసుకుంటున్నాడ‌ట‌. పెద్ద‌యెత్తున వ‌ర్క్‌ షాపులు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. `ఓకే బంగారం` త‌ర్వాత మ‌ణిర‌త్నం మ‌రో సినిమా చేయ‌లేదు. మొద‌ట ఇద్ద‌రు హీరోల‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు.

ఇప్పుడేమో సోలో హీరోగా కార్తీతో సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. అందులో కార్తీ విమానాల్ని న‌డిపే పైల‌ట్‌ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలిసింది. ఆయ‌న ఇదివ‌ర‌కెప్పుడూ ఇలాంటి పాత్ర‌ని చేయ‌లేదు. అస‌లు పైల‌ట్ పాత్ర‌ల్లో చాలా త‌క్కువ‌మంది క‌థానాయ‌కులే క‌నిపించారు. దీన్నిబట్టి మ‌ణిర‌త్నం ఏదో ఓ టిపిక‌ల్ స‌బ్జెక్టునే త‌యారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

మ‌ణిర‌త్నం సినిమాలో ఛాన్స్ అంటే ఆషామాషీ కాదు. ఆయ‌న ద‌గ్గ‌ర స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన కార్తీకి ఇప్పుడు ఆయ‌న సినిమాలో క‌థానాయ‌కుడిగా న‌టించే అవ‌కాశం రావ‌డం విశేషం. ఈ గురుశిష్యుల సినిమా ఎలా వుండ‌బోతోందో చూడాలి మ‌రి! ఓకే బంగారంకి ముందు మ‌ణ‌ర‌త్నం వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర్కొన్నాడు. ఇక మ‌ణిర‌త్నం మేజిక్ ప‌వర్ అయిపోయింద‌నుకొంటున్న ద‌శ‌లో ఓకే బంగారంతో మ‌ళ్లీ హిట్టు కొట్టాడు. ఓకే బంగారం సినిమాని చూస్తే ఏ కుర్ర ద‌ర్శ‌కుడో తీసిన‌ట్టు అనిపిస్తుంది. లివింగ్ రిలేష‌న్‌ షిప్‌ పై తెర‌కెక్కిన ఆ చిత్రం ప్రేక్ష‌కుల‌కే కాదు, విమ‌ర్శ‌కుల్ని కూడా మెప్పించింది. మ‌ణిర‌త్నం ఆలోచ‌న‌లు ఎంత యంగ్‌ గా వుంటాయో ఆ చిత్రం చాటి చెప్పింది. దాంతో త‌దుప‌రి మ‌ణిర‌త్నం చేయ‌బోయే చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే మ‌ణిర‌త్నం ఆచితూచి సినిమాని మొద‌లుపెట్టాడు.