హీరోని చిక్కుల్లో నెట్టిన దర్శకుడి కాకా!!

Fri Sep 21 2018 21:43:07 GMT+0530 (IST)

సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం దర్శకులు చేసే సర్కస్సులు కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. అన్ని మన దృష్టికి రావు కానీ తెరవెనుక జరిగే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. అతనో యూత్ హీరో. ఓ దర్శకుడితో మంచి పరిచయం ఉంది. సుమారు 2 ఏళ్ళ నుంచి సదరు దర్శకుడు ఖాళీగా ఉన్నాడు. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో ఒక మూవీ వచ్చింది. యావరేజ్ ముద్రతో హిట్ అనిపించుకుని నష్టాలు లేని వసూళ్లు తెచ్చి పాస్ అయిపోయింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ డైరెక్టర్ మళ్ళి ఇంకో సినిమా చేయలేకపోయాడు. ఛాన్స్ రాలేదో లేక ఈయనే కావాలని చేయలేదో ఎవరికి తెలియదు. ఈ లోపు అతనితో  ముందు చేసిన హీరో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాడు. రెండు హిట్లతో దారిలో పడ్డాడు. కానీ మన దర్శకుడు మాత్రం ఆ హీరోని  నిను వీడని నీడను నేనే తరహాలో వెంటపడుతూనే ఉన్నాడు. నువ్వు సూపర్ బాబు అది బాబు ఇది బాబు కేక బాబు అంటూ రోజు పొగడ్తల సుప్రభాతంతో మేలుకొలుపు పాడుతున్నాడట.పాపం మన హీరో మింగలేక కక్కలేక కక్కలేక అతనికి నేరుగా చెప్పలేక స్నేహితుల దగ్గర వాపోతున్నాడు. తనను ఆ డైరెక్టర్ పెడుతున్న టార్చర్ గురించి బాధను షేర్ చేసుకుంటూ పరిష్కారం కోసం సలహా అడుగుతున్నాడట. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకో ట్విస్ట్ ఉంది. అదే దర్శకుడు చేతిలో సరైన స్క్రిప్ట్ కథ లేకుండానే ఆ హీరోతోనే తన నెక్స్ట్ మూవీ అంటూ కొత్త కర్చీఫ్ వేసేసి మీడియా మిత్రుల దగ్గర చెప్పుకోవడంతో అది కాస్తా న్యూస్ రూపంలో కూడా బయటికి వచ్చేసిందట. దీంతో దాన్ని ఖండించలేక ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో పడ్డ హీరో ఈ విషయంగా బాగా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఇంకో దర్శకుడు హీరో దగ్గరికి రాకుండా ఈ దర్శకుడే హీరో క్యాంప్ చుట్టూ తిరుగుతున్నాడట. ఇప్పుడు ఇతన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక హీరో బుర్ర వేడెక్కి పోతోందని టాక్. అంతే మరి. స్నేహం వల్ల వచ్చిన మొహమాటం తెచ్చే ఇబ్బంది ఈ రూపంలో ఉంటుందని అతనికైనా తెలియదు కదా. ఇప్పుడు నేర్చుకున్నాడు. మరి ఈ చిక్కు నుంచి ఎలా బయటపడతాడో అని ఎదురు చూస్తున్నారు అతని సన్నిహితులు.