Begin typing your search above and press return to search.

ప్రేమికుల రోజు గిఫ్ట్: ఆర్య‌- స‌యోషా పెళ్లి

By:  Tupaki Desk   |   14 Feb 2019 7:33 AM GMT
ప్రేమికుల రోజు గిఫ్ట్: ఆర్య‌- స‌యోషా పెళ్లి
X
త‌మిళ హీరో ఆర్య‌, `అఖిల్‌` సినిమా హీరోయిన్ స‌యోషా ప్రేమించుకుంటున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవ‌ల జోరుగా వార్త‌లు షికారు చేసిన విష‌యం తెలిసిందే. ఈ వార్త‌లపై గ‌త కొన్ని రోజులుగా మౌనంగా వున్న ఆ జంట ప్రేమికుల రోజైన గురువారం పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. తాము గ‌త కొంత కాలంగా ప్రేమించుకుంటున్నామ‌ని, మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నామ‌ని హీరో ఆర్య గురువారం ప‌త్రికా ముఖంగా ప్ర‌క‌టించేశారు.

వాలెంటైన్స్‌డే సాక్షిగా ఓ అంద‌మైన గ్రీటింగ్ కార్డుని సోష‌ల్ మీడియాలో ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో పంచుకున్న ఆర్య ఇరు కుటుంబాల సాక్షిగా మార్చిలో వివాహ బంధంతో ఒక్క‌టి కాబోతున్నామంటూ ప్ర‌క‌టించ‌డం సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. త‌ల్లిదంత్రులు, కుటుంబం, అలాగే మీ అంద‌రి దీవెన‌ల‌తో మీ జీవితంలోనే మ‌ధుర క్ష‌ణాల‌కు సాక్షిగా నిలిచే ఆ అరుదైన రోజుకు సంబంధించిన విశేషాల‌ని మీతో పంచుకోవాల‌నుకుంటున్నాం. ప్రేమ‌బంధంతో ఒక్క‌టి కాబోతున్న మాకు మీ ప్రేమ‌, దీవెన‌లు కావాలి` అంటూ ఆర్య పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వాస్త‌వానికి సౌత్ లో సీనియ‌ర్ బ్యాచిల‌ర్ గా పాపుల‌రైన ఆర్య చాలాకాలంగా పిల్ల కోసం వెతుకుతున్నాడు. కొన్నిసార్లు మీడియా ముఖంగానే ప్ర‌క‌ట‌న‌లు గుప్పించ‌డం సంచ‌ల‌న‌మైంది. పేదింటి అమ్మాయే అయినా న‌చ్చితే పెళ్లాడేస్తానంటూ ప్ర‌క‌టించ‌డంపై అప్ప‌ట్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. కానీ చివ‌రికి బాలీవుడ్ కి చెందిన ఫేమ‌స్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని వెతుక్కుని ఓ ఇంటి వాడు అయిపోతున్నాడు. సైరా భాను - దిలీప్ కుమార్ మ‌న‌వ‌రాలిగా స‌యేషా అంద‌రికీ సుప‌రిచితం. ఈ పెళ్లితో ఆర్యకు మునుముందు కెరీర్ ప‌రంగా మ‌రింత బూస్ట్ దొరుకుతుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.