శృతి మిస్సయ్యింది.. ఈమెకు పండగ

Sun Mar 19 2017 14:02:35 GMT+0530 (IST)

నిన్నటి కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంటును కావాలనే చాలా చిన్నగా నిర్వహించినట్లు చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ ఈవెంట్లో సుందరాంగి శృతి హాసన్ మెరుపులు మిస్సవ్వడం మాత్రం అభిమానులను కలవరపెట్టేశాయి. అమ్మడు మాత్రం వర్కులో ఫుల్లుగా బిజీగా ఉండటం వలన తాను రాలేకపోతున్నానని ముందే చెప్పేసింది. ఆ దెబ్బకి అందరికీ హృదయం ముక్కలైయుంటుంది. ఇదే సమయంలో ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకుంది ఒక తెలుగు బ్యూటి.

బస్ స్టాప్ వంటి సినిమాల్లో నటించినా కూడా ఇంకా పెద్దగా పేరు తెచ్చుకోని హీరోయిన్ మానస హిమవర్ష. అయితే అమ్మడు సడన్ గా పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు సినిమాలో నటిస్తోంది అనగానే అందరూ స్టన్ అయిపోయారు. పవన్ సరసన అంటే.. హీరోయిన్ గా కాదులేండి. కాటమరాయుడులో పవన్ తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీకి పెయిర్ గా ఈమె నటిస్తోందట. ఇక ఫంక్షన్ విషయానికొస్తే.. శృతి ఎలాగో రాలేదు కాబట్టి.. మానస తన అందాలతో అక్కడ సందడి చేసే ప్రయత్నం చేసింది. కాస్త ఘాటుగానే రెచ్చిపోయింది.

ఒక్కోసారి పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తే బ్రేక్ బాగానే వస్తుంది. మరి కత్తిలాగున్న ఈ తెలుగుపిల్ల కెరియర్ ను కాటమరాయుడు టర్నింగ్ చేస్తాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/