Begin typing your search above and press return to search.

ఇంకో పేలిపోయే హార్రర్ కామెడీ వస్తోంది

By:  Tupaki Desk   |   24 Nov 2015 1:30 PM GMT


హార్రర్ కామెడీ.. గత రెండు మూడేళ్లుగా తెలుగు - తమిళ సినీ పరిశ్రమల్ని ఊపేస్తున్న జానర్. తమిళంలో కాంఛన - ఆరణ్మయి లాంటి సినిమాలు.. తెలుగులో ప్రేమకథా చిత్రమ్ - గీతాంజలి లాంటి సినిమాలు ఈ జానర్ కు మంచి ఊపు తెచ్చాయి. వీటి స్ఫూర్తితో రెండు భాషల్లో మరిన్ని హార్రర్ కామెడీలు తెరకెక్కుతున్నాయి. మన దగ్గర ఈ జానర్ లో వచ్చే సినిమాలు కొంచెం మొహం మొత్తేస్తున్నాయి కానీ.. తమిళంలో మాత్రం క్రియేటివ్ ఐడియాస్ తో పేలిపోయే హార్రర్ కామెడీలు వస్తున్నాయి. ఆ కోవలో వచ్చిన కొత్త సినిమానే ‘హలో.. నాన్ పేయ్ పేసురేన్’. దీనికి అర్థం... ‘హలో నేను దయ్యాన్ని మాట్లాడుతున్నా’ అని.

మన తెలుగబ్బాయి వైభవ్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. నిన్నే ట్రైలర్ రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ట్రైలర్ చాలా ఫన్నీగా - ఇంట్రెస్టింగ్ గా ఉండటమే దీనికి కారణం. ఈ మూవీ కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఫోన్ తో ముడిపడిన హార్రర్ కామెడీ ఇది. హీరో మొబైల్ కి కాల్ వస్తే దయ్యం వచ్చేసినట్లే అన్నమాట. అందుకే సినిమాకు అలాంటి పేరు పెట్టారు. ఇందులోనూ దయ్యం కామెడీ బ్యాచ్ ను వాయించే సన్నివేశాలే కనిపిస్తున్నాయి కానీ.. హార్రర్ - కామెడీ చాలా బాగానే వర్కవుటైనట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారట. డిసెంబర్ లోనే ‘హలో నాన్ పేయ్ పేసురేన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.