`హలో` టైటిల్ సాంగ్ లో అఖిల్ అదరగొట్టాడు

Sat Dec 09 2017 17:48:31 GMT+0530 (IST)

`అక్కినేని` నట వారసుడిగా అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అఖిల్ కు ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయినప్పటికీ ఆ సినిమాలో అఖిల్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ డిజాస్టర్ కావడంతో అఖిల్ రెండో సినిమాపై నాగ్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. హలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన మెరిసే...మెరిసే ...పాటలో అఖిల్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన `హలో` టైటిల్ సాంగ్ ట్రైలర్ లో అఖిల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. సింపుల్ గా ఉన్న స్టెప్పులతోనే చూపరులను కట్టిపడేశాడు.ఈ టైటిల్ సాంగ్ ట్రైలర్ లో సిట్యుయేషన్ - లొకేషన్ కు తగ్గట్లుగా అఖిల్ డ్యాన్స్ చేశాడు. మంచి ఫీల్ గుడ్ మూడ్ లో సాగిపోతున్న ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. అనుప్ ఇచ్చిన ఫ్రెష్ ట్యూన్స్ కు అంతే ఫ్రెష్ గా - సింపుల్ గా అఖిల్ డ్యాన్స్ చేశాడు. ఈ టైటిల్ సాంగ్ ట్రైలర్ చివర్లో అఖిల్ మరో ఇద్దరు డ్యాన్సర్లతో వేసిన స్టెప్పులు  హైలైట్. అఖిల్ ఫేస్ కనబడకుండా - మరో ఇద్దరు డ్యాన్సర్లతో కలిసి అఖిల్ వేసిన స్టెప్పులు చాలా స్పెషల్ గా ఉన్నాయి. అఖిల్ స్టెప్పులు కంటిన్యూ చేస్తుండగానే ఆ ఇద్దరు డ్యాన్సర్లు మెల్లగా వెనక్కు వెళ్లిపోవడం...బ్యాక్ గ్రౌండ్ లో పడుతున్న వర్షంలో పిల్లలు కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేస్తుండడం ఆ టీజర్ కు మంచి ఫినిషింగ్ ఇచ్చాయి. ట్యూన్ కు తగ్గట్లు స్టెప్పులు ఎలివేట్ అవ్వడంతో ఆ సాంగ్ మూవీకి హైలైట్ గా నిలిచేలా ఉంది. మొత్తానికి అక్కినేని అభిమానులను పూర్తి స్థాయిలో అలరించేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడని ఈ టైటిల్ టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.