Begin typing your search above and press return to search.

వీడియో టాక్: రేస్ పాట రచ్చరచ్చే

By:  Tupaki Desk   |   18 May 2018 3:29 PM GMT
వీడియో టాక్: రేస్ పాట రచ్చరచ్చే
X
బాలీవుడ్ రేస్ సిరీస్ సినిమాలంటేనే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్.. అదరగొట్టే సొగసరుల అందాల ఆరబోతల కలయిక. ఇప్పటిదాకా వచ్చిన రేస్ రెండు పార్టుల్లోనూ హీరోయిన్లు గ్లామర్ ను ప్రదర్శించడంలో ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా వస్తున్న రేస్-3లోని హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఈ విషయంలో ఇంకా బాగా రెచ్చిపోయింది.

రేస్-3 మూవీ ట్రయిలర్ ఇప్పటికే హీరో సల్మాన్ అభిమానులను.. యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది. రీసెంట్ గా ఇందులోని హిరియే సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. డ్యాన్స్ ఫ్లోర్ పై వచ్చే ఈ పాట అదిరిపోయింది. మ్యూజిక్ అండ్ సెట్టింగ్స్ ప్రేక్షకుల మతిపోగొట్టేలా ఉన్నాయి. ఈ పాటలో జాక్వెలైన్ గ్లామర్ అసలు సిసలైన హైలైట్. వైట్ కలర్ టాప్స్ లో టాప్ రేంజిలో అందాలన్నీ చూపిస్తూ అమ్మడు వేసిన స్టెప్పులకు అంతా ఫిదా అయిపోవాల్సిందే. దానికి తోడు పోల్ డ్యాన్స్ చేస్తూ వేసిన స్టెప్పులకు రెప్ప వేయడం మర్చిపోతాం. ఈ ఏడాది మొత్తం డ్యాన్స్ ఫ్లోర్ పై హిరియే పాట గ్యారంటీగా వినిపిస్తూనే ఉంటుంది. సల్మాన్ ఎప్పటిలాగే స్టయిలిష్ గా తనకు అలవాటయిన స్టెప్పులతో అభిమానులను అలరించాడు.

రేస్ మొదటి రెండు పార్టులకు అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించారు. రేస్ -3లో మాత్రం ఆ ప్లేసుకులోకి రెమో డిసౌజా వచ్చి చేరాడు. సల్మాన్ ఖాన్ తోపాటు బాబిడియోల్ - డైసీ షా - అనిల్ కపూర్ ఇంపార్టెంట్ పాత్రలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ అండ్ టిప్స్ ఫిలింస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి