Begin typing your search above and press return to search.

హేభా ఇంకా అలాగే ఉందే

By:  Tupaki Desk   |   27 Nov 2015 10:30 PM GMT
హేభా ఇంకా అలాగే ఉందే
X
డైరెక్టర్ సుకుమార్ కి టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. దీనికి తగ్గట్లుగానే ఈయన సినిమాల్లో కాన్సెప్ట్ లు కూడా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. సుకుమార్ ను ఓ మేథావి కింద జమకడతారు టాలీవుడ్ జనాలు. సుక్కు చెప్పే మాటలకు కూడా బోలెడు వాల్యూ ఉంటుందని చెబుతారు. ఆయన ఏదన్నా చెబ్తే గుడ్డిగా ఫాలో అయిపోయినా.. రిజల్ట్ బాగుంటుందని నమ్మేవారు కూడా చాలామందే ఉన్నారు. మరి అలాంటి సుకుమార్ తను నిర్మించిన సినిమాలో హీరోయిన్ కి ఓ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడని గతంలో చెప్పుకున్నారు.

అందుకే కుమారి 21ఎఫ్ లో నటించిన హేభా పటేల్ గేర్ మార్చిందని కూడా తెలిసింది. నిజానికి ఈ మూవీ స్టార్టింగ్ నుంచి చాలా సార్లు మోస్ట్ గ్లామరస్ గా కనిపించిన హేభా.. మూవీ రిలీజ్ కి వారం ముందు ట్రెండ్ మార్చేసింది. క్లీవేజ్ షోలతో మతులు పోగొట్టే రేంజ్ నుంచి.. పద్ధతైన మోడ్రన్ గాళ్ గెటప్ లోకి వచ్చేసింది. కుమారిపై బ్యాడ్ ఇంప్రెషన్ పడకుండా ఉండేందుకు ఇలా ఆర్డర్స్ పాస్ చేశాడని టాక్ వినిపించింది. అయితే.. ఇప్పుడు కుమారి 21 ఎఫ్ రిలీజ్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, మంచి కలెక్షన్స్ కూడా రాబట్టేస్తోంది. ఈ ఏడాది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ప్రశంశలు కూడా అందుకుంటోంది. యూత్ మూవీ టాక్ తో రిలీజ్ అయినా.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి టాక్ నే తెచ్చుకుంది.

అయితే. ఇప్పటికీ కుమారి పాత్రధారి హేభా పటేల్ మాత్రం.. ఇంకా ఫుల్ డ్రెస్సుల్లోనే కనిపిస్తోంది. చెయ్యి - కాలు కూడా కనిపించకుండా డ్రసింగ్ ఏంటో అని అందరూ మాట్లాడుకుంటున్నారంటే.. ఈమె గెటప్ ఎలా ఉంటోందో అర్ధమవుతోంది. రిలీజ్ ముందంటే టాక్ కోసం తప్పదు.. ఇప్పుడు సినిమా రిలీజ్ అయి హిట్ అయ్యాక కూడా ఇంకా డైరెక్టర్ ఆజ్ఞలను పాటిస్తోందంటే... సుక్కు ఎంత స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడో అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.