Begin typing your search above and press return to search.

కుమారి ఎక్కడికి పోతోందో తెలుసా!!

By:  Tupaki Desk   |   23 July 2017 9:54 AM GMT
కుమారి ఎక్కడికి పోతోందో తెలుసా!!
X
తెలుగు సినిమాలలో టీనేజ్ హీరోయిన్ గా కుర్రకారు మెచ్చే కుర్ర హీరోయిన్ గా పేరు ఉన్న భామ హెబ్బా పటేల్. కుమారి 21F తో మంచి విజయం పొందిన హేబా పటేల్ ఆ తరువాత ఆలోచించకుండా వరుస పెట్టి సినిమాలలో నటించింది. ఇప్పుడు ఈ కుర్ర హీరోయిన్ కు వరుస అపజయాలు రావడంతో కొంచెం ఆలోచనలో పడింది. నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్.. అంధగాడు వంటి సినిమాలు ఈమె కెరియర్ కు ఏమంత లాభం తేలేకపోయాయ్.

2017 లో నైనా కొంచెం కొత్త సినిమాలు వచ్చి తన స్టార్ విలువను పెంచుతాయి అనుకుంటే వచ్చిన కొన్ని సినిమాలు కూడ సరిగా ఆడక ఏదో అలా నడిపిస్తుంది. వరుణ్ తేజ్ మిష్టర్ సినిమా పై ఎక్కువ అంచనాలు పెట్టుకున్న హేబా పటేల్ ఆ సినిమా ఫలితాలు నిరాశనే మిగిల్చింది. అంధగాడు తో కలిపి 2017లో ఇంకా సరైన విజయం పొందలేదు అనే చెప్పాలి. అయితే హెబ్బా పటేల్ ఇప్పుడు ఏంజెల్ అనే సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా తరువాత ఏమీ సైన్ చేయలేదు. ఎందుకంటే అమ్మడు ఎక్కువ సేపు జిమ్ చేస్తోందట. ఈ మధ్యన అమ్మడు బొద్దెక్కిందంటూ బాగా కామెంట్లు పడుతుండటంతో.. ఇప్పుడు అమ్మడు సన్నబడ్డానికి సర్వప్రయత్నాలు చేస్తోందనమాట. అందుకే రోజూ జిమ్ముకి పోతోంది. ఈ దెబ్బతో మరి కొన్ని సినిమా అవకాశాలు వచ్చి పడాలి అనేలా తపనతో తెగ కష్టపడుతోందట.

ఏదేమైనా కూడా ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఇలా వెయిటింగ్ లిస్ట్ కే పరిమితం అయిపోతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ కొరత అయితే ఉందేమో కాని.. చిన్న హీరోయిన్ల విషయంలో పెద్దగా కొరతేం లేదు. లావణ్య త్రిపాఠి.. ప్రగ్యా జైస్వాల్.. అను ఎమ్మానుయేల్.. నివేదా థామస్.. ఇలా చాలామంది హీరోయిన్లు ప్రామిసింగ్ గా.. కొందరు గ్లామరస్ గా కూడా కనిపిస్తుండటంతో.. హెబ్బా కు ఆఫర్లు జోరు తగ్గే ఛాన్సుంది.