24 కిసెస్ తో రానున్న కుమారి

Thu Jun 14 2018 09:56:55 GMT+0530 (IST)

స్టార్ హీరోయిన్ కావడానికి కావాల్సిన అన్ని ఫీచర్లు ఉన్న బ్యూటీ హెబ్బా పటేల్. మొదటి సినిమా కుమారి 21ఎఫ్ తో తన గ్లామర్ తో మెరుపులు మెరిపించిన ఈ భామ తరవాత ఏ సినిమాలోనూ ఆ రేంజిలో క్లిక్కవ లేదు. కాలం కలిసిరాక.. సరైన సినిమాలు పడక తెర వెనక్కి వెళ్లిపోయింది.మళ్లీ హెబ్బా పటేల్ కు తన టాలెంట్ చూపే అవకాశం వచ్చింది. మిణుగురులు మూవీతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న అయోధ్య కుమార్ తీస్తున్న అడల్ట్ లవ్ స్టోరీ 24 కిసెస్ లో హెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం బ్యూటీ చాలా కష్టపడుతోందట. 24 కిసెస్ లో హెబ్బా మీడియా స్టూడెంట్ గా కనిపించనుంది. స్టూడెంట్ గా ఓ కొత్త లుక్ లో కనిపించడం కోసం వర్కవుట్లు అవీ గట్టిగా చేసి 10 కేజీలకు పైగా తగ్గిందట. పాత్రలో తన నటన మెప్పించేలా ఉండటం కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ కు కూడా అటెండయి ట్రైనింగ్ తీసుకుంది. ఈ సినిమాతో ప్రేక్షకులు ఓ కొత్త హెబ్బా పటేల్ ను చూస్తారని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

24 కిసెస్ సినిమాలో హీరోగా అదిత్ ఆర్య నటిస్తున్నాడు. ఇతడు అప్పట్లో జెనీలియా హీరోయిన్ గా నటించిన కథ మూవీతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 24 కిసెస్ లో అతడిది చిన్న పిల్ల సినిమా డైరెక్టర్ పాత్ర. హీరోయిన్ తో పరిచయం ఏర్పడి అది 24 ముద్దుల వరకు ఎలా డెవలప్ అయిందన్నది మిగతా కథ. ఈ సినిమా దాదాపు కంప్లీటయ్యే స్టేజ్ లో ఉంది.