సుక్కుకి నో చెప్పిన కుమారి..

Tue Mar 13 2018 18:08:01 GMT+0530 (IST)

హెబ్బా పటేల్.. ఆ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే సుకుమార్ వల్ల. అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హెబ్బకు కుమారి 21ఎఫ్ సినిమాతో హిట్ అందించింది సుకుమార్ క్రియేట్ చేసిన పాత్రే. హెబ్బ - రాజ్ తరుణ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చాలా పెద్ద హిట్. కానీ అలాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ కి ఇప్పుడు నో చెప్పిందట.నిజానికి కుమారి 21ఎఫ్ తర్వాత ఒకటి రెండు తప్ప అంత బాగా ఆడిన సినిమాలు లేనే లేవు. ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా హైప్ ఉన్న సినిమాలలో రంగస్థలం ఒకటి. ఆ సినిమా లో అనసూయ ఒక చిన్న పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అసలైతే ఆ పాత్ర హెబ్బ చేయాల్సిందంట. ముందుగా సుకుమార్ ఈ పాత్రను హెబ్బాకు ఆఫర్ చేయగా చిన్న కారెక్టర్ అవ్వడం మూలాన ఆమె దానికి సున్నితంగా నో చెప్పిందట. కొంచెం ఫీల్ అయినా సుక్కు ఆ పాత్ర అనసూయ కూడా బాగానే ఉంటుంది అనిపించి తనని తీసుకున్నాడు.

అసలే చేతిలో ఆఫర్లు - చెప్పుకోదగిన హిట్లు లేని హెబ్బకు రంగస్థలం బోలెడంత బూస్ట్ ఇచ్చుండేది. కానీ ఏం చేస్తాం మంచి అవకాశాన్ని తానే వద్దనుకుని ఇప్పుడు మరొక సినిమాలో ఆఫర్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది ఈ ముంబై భామ.