కన్నడ కుమారికి హెబ్బా నో అందుకే చెప్పిందా!

Thu Sep 14 2017 12:32:15 GMT+0530 (IST)

సుకుమార్ రైటింగ్స్ ఫస్ట్ ఎట్మెంట్ కుమారి 21 ఎఫ్ హిట్ కి మెయిన్ రీజన్ హెబ్బా పటేల్ స్కిన్ షో అనడంలో ఎలాంటి డౌటు అవసరం లేదు. కుమారిగా హెబ్బా గ్లామర్ షోకి కుర్రకారు ఫిదా అయిపోయారు. దీంతో ఈ బ్యూటీని గ్లామర్ యాంగిల్ లోనే వాడుకుంటూ వస్తున్నారు తెలుగు దర్శకనిర్మాతలు. హెబ్బాకి మాస్ హీరోయిన్ అనే ట్యాగ్ ఇచ్చేసి సినిమా - సినిమాకి ఆమె గ్లారమ్ పరిమితులు పెంచుకుంటూ పోతున్నారు. ఆమె చుట్టూనే కథలు అల్లే రేంజ్ కి హెబ్బా వెళ్లిపోయిదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.

అయితే హెబ్బా కూడా గ్లామర్ షో చేయడంలో ఎలాంటి షరతలు ఇంతవరుకు పెట్టకపోవడంతో నాలుగు సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కానీ ఇటీవల వరుస ఫ్లాపులు ఈ బ్యూటీని పలకరించడంతో హెబ్బాలో చాలా మార్పులు వచ్చాయని సినీ జనాలు అంటున్నారు. తెలుగులో ఈ బ్యూటీ నుంచి రావాల్సిన ఏంజెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి వచ్చేసింది. గ్రాఫిక్స్ కి సంబంధించిన పనుల్లో ఏంజెల్ చిక్కుకుపోయింది. ఈ ప్రాజెక్ట్ గనుక హిట్ అయితే వేరే సినిమాల్లో హెబ్బాకి ఆఫర్లు వస్తాయి. ఈ లోపున హెబ్బాని కుమారి 21 ఎఫ్ కన్నడ రీమేక్ లో నటించమన్నారట. అయితే స్కిన్ షోకి హెబ్బా చాలా రూల్స్ పెట్టడంతో ఈమె ప్లేస్ లోకి ఓ లోకల్ బ్యూటీ తీసుకొని కుమారి 21 ఎఫ్ కన్నడ రీమేక్ ని లాగించేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అవకాశాలు తగ్గి కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న హెబ్బా ఇలా చేతులారా వచ్చిన గోల్డెన్ ఆఫర్ ను అనవసరంగా రిజెక్ట్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏంజెల్ తరువాత హెబ్బా కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి..!