Begin typing your search above and press return to search.

కుమారి చిట్ట చివ‌రి ప్ర‌య‌త్నం?

By:  Tupaki Desk   |   15 July 2019 1:30 AM GMT
కుమారి చిట్ట చివ‌రి ప్ర‌య‌త్నం?
X
అందం కంటే ప్ర‌తిభ‌తో నెగ్గుకొచ్చిన భామ‌గా హెబ్బా ప‌టేల్ గురించి చెప్పాలి. `కుమారి 21 ఎఫ్` కోసం సుకుమార్- ప్ర‌తాప్ బృందం ఈ ముంబై బ్యూటీని ఎంపిక చేసుకున్నారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన హెబ్బా అటుపై వ‌రుస‌గా అర‌డ‌జ‌ను పైగానే సినిమాల్ని ఖాతాలో వేసుకుంది. మంచు కాంపౌండ్ సినిమా `ఈడోర‌కం ఆడోర‌కం`... వ‌రుణ్ తేజ్- మిస్ట‌ర్.. నాన్న నేను బోయ్ ఫ్రెండ్.. అంధ‌గాడు.. ఏంజెల్.. ఇలా వ‌రుస‌గా సినిమాల్లో న‌టించింది. అయితే ఇవేవీ ఆశించిన స్థాయి విజ‌యాల్ని అందించ‌లేదు. నిఖిల్ స‌ర‌స‌న రెండో లీడ్ గా న‌టించిన `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?` మిన‌హా మిగ‌తావ‌న్నీ ప‌రాజ‌యాలే కావ‌డంతో ఈ అమ్మ‌డికి ఆశించిన స్థాయిలో ఛాన్సులు రాలేదు.

ఆ క్ర‌మంలోనే `24 కిస్సెస్` అంటూ మ‌రో బోల్డ్ సినిమాలో న‌టించింది. కానీ డీగ్రేడ్ అంటూ జ‌నాలు తిర‌స్క‌రించారు. ఆ త‌ర్వాత చాలా కాలంగా హెబ్బా ఛాన్సుల్లేక ఎదురు చూడాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు యంగ్ బ్యాచిల‌ర్ హీరో నితిన్ స‌ర‌స‌న `భీష్మ‌`లో అవ‌కాశం అందుకుంది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న మెయిన్ లీడ్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర‌హాలోనే రెండో లీడ్ లో అవ‌కాశం ద‌క్కించుకుంది.

ప్ర‌స్తుతం నితిన్ - హెబ్బా జంట‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు టీమ్ రెడీ అవుతోంది. ఇదో రొమాంటిక్ డ్రామా. ఇందులో హెబ్బాతో కాస్తంత ఘాటైన రొమాన్స్ ఉంటుంద‌ట‌. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఛ‌లో ఫేం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నితిన్ -ర‌ష్మిక - హెబ్బా కాంబినేష‌న్ తో ఈ టీమ్ ఏ మేర‌కు మ్యాజిక్ చేయ‌బోతోంది? కుమారి హెబ్బా ఈ సినిమాకి ఎంత‌వ‌ర‌కూ ప్ల‌స్ అవుతుంది అన్న‌ది ఇప్ప‌టికైతే సస్పెన్స్. అందుకే హెబ్బాకి ఇది ఆల్మోస్ట్ చివ‌రి ప్ర‌య‌త్న‌మేనా? అంటూ చ‌ర్చ సాగుతోంది.