Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హెబ్బా పిచ్చెత్తిస్తోంది

By:  Tupaki Desk   |   17 Nov 2017 1:54 PM GMT
ఫోటో స్టోరి: హెబ్బా పిచ్చెత్తిస్తోంది
X
టాలీవుడ్ లో హీరోయిన్ ఛాన్స్ దొరకడం అంటే చాల అదృష్టం అని నార్త్ భామల ఫీలింగ్. ఇక్కడ హిట్టు కొడితే కెరీర్ కు ఓ దారి దొరికనట్టే అని ఫీల్ అవుతుంటారు. కానీ అందరి అదృష్టం ఒకేలా ఉండదు కదా. నటిగా మంచి మార్కులు అందుకున్నా అలాగే హిట్టు అందుకున్నా కొన్ని రోజులకే ఫెడ్ అవుట్ అయిపోతారు. మళ్లీ కెరీర్ ని ట్రాక్ లోకి తేవాలంటే చాలా కష్టమే.

అయితే ఎంత కష్టమైన హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని అనుకుంటోంది కుమారి హబ్బా పటేల్. కుమారి 21F తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న హెబ్బా ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు అమ్మడి నటనను గ్లామర్ షోని చూసి అందరు స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏంజెల్ అనే సినిమా రిలీజ్ చేసినా కూడా హెబ్బా సక్సెస్ ని చూడలేకపోయింది.

ఇక అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా హెబ్బా తెనాలిలో గ్లామర్ షోతో ఆదరగొట్టసింది. అక్కడ బి న్యూ మొబైల్ స్టోరి ని ఓపెన్ చేసి షో రూమ్ లో నవ్వులు చిందించింది. ఆ నవ్వులకి కాస్త క్లివెజ్ షోని కూడా యాడ్ చేసి కుర్రకారును తెగ ఆకర్షించింది. అవకాశాలు లేకపోయినా హెబ్బా కి ఇలాంటి ఆఫర్స్ బాగానే అందుతున్నాయి.