నారాయణమూర్తి ట్రైలర్ కి ఖైదీ కలర్...!

Thu Jan 12 2017 11:57:04 GMT+0530 (IST)

ఈ సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలమధ్య దూరేసింది "హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య". ఆర్ నారాయణమూర్తి హీరోగా జయసుధ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సమయంలో విడుదలవడం ఎంత కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఏదోలా థియేటర్లను సంపాదించుకున్నారు వెంకట్రామయ్య. అయితే ఈ సినిమాపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఒక ఔత్సాహికుడు తన స్కిల్స్ తో "హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య" ట్రైలర్ ను రీమిక్స్ చేశాడు.

సాదారణంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఫ్యాన్ మేడ్ వీడియోలు ఒక్కోసారి సంచలనాలే సృష్టిస్తుంటాయి. మరికొన్ని సందర్భాలో ఒరిజినల్ ట్రైలర్ ల కంటే కూడా ఈ ఫ్యాన్ క్రియేటివిటీ ట్రైలర్స్ బాగుంటాయి కూడా. అయితే తాజాగా ఆర్ నారాయణమూర్తి ట్రైలర్ ను "ఖైదీ నంబర్ 150" సినిమా ట్రైలర్ తో మిక్స్ చేసి ఆన్ లైన్ లో వదిలారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీరు ఓ లుక్కేయండి...Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/