Begin typing your search above and press return to search.

ఒకేసారి ఆరుగురితో ప్రేమా?

By:  Tupaki Desk   |   21 April 2019 4:26 AM GMT
ఒకేసారి ఆరుగురితో ప్రేమా?
X
సాధారణంగా సినిమాల్లో ఒక హీరో ఇద్దరు హీరొయిన్లు లేదా ఒక అమ్మయి ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథలు ఇప్పటిదాకా కొన్ని వేలల్లో చూసుంటాం. ట్రయాంగిల్ లవ్ అనేది ఎప్పటికీ చెదిరిపోని ఫార్ములా. అలనాటి ప్రేమాభిషేఖంతో మొదలుపెట్టి నిన్నటి మజిలి దాకా చూసుకుంటే ఇలాంటివి ఎన్నో వచ్చాయి ఘన విజయం సాధించాయి.

అదే కోణంలో ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నాడు కాబోలు దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ కొత్తగా అలోచించి ఏకంగా డబుల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీతో వస్తున్నాడు. అదే సెవెన్. అంటే ఒక హీరో. ఆరుగురు హీరొయిన్లు. అందుకే టైటిల్ కూడా ఆ నెంబర్ ను సూచించే విధంగా సెవెన్ అని పెట్టారు

జీనియస్ తో పేరు తెచ్చుకున్న హవీష్ హీరోగా రూపొందుతున్న సెవెన్ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్న టీం ఒకేసారి ఆరుగురు హీరోను ప్రేమించడం అనే పాయింట్ కొత్తగా ఉంటుందని దాన్ని థ్రిల్లర్ జానర్ లో చెప్పడం ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు.

లవ్ లేడీస్ గా రెజినా కసెండ్రా-నందితా శ్వేతా- పూజితా పొన్నాడ- అనీష అంబ్రోస్-అదితి ఆర్య-త్రిధా చౌదరిలు నటిస్తున్నారు. ఇందరేసి ముద్దుగుమ్మల మధ్య ఈ హవీష్ చేసేదేంటో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆరెక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న సెవెన్ త్వరలో విడుదల చేసేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాత రమేష్ వర్మ దీనికి స్క్రిప్ట్ అందించడం విశేషం