Begin typing your search above and press return to search.

శర్వానంద్ కు పండగ లక్కు

By:  Tupaki Desk   |   15 Dec 2018 7:54 AM GMT
శర్వానంద్ కు పండగ లక్కు
X
ఎంత సినిమా పరిశ్రమ క్రియేటివిటీ మీద ఆధార పడ్డదే అయినా ఇక్కడా కొన్ని సెంటిమెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అనుకుని ప్లాన్ చేసుకున్నవి కొన్ని ఉంటే అనుకోకుండా కాకతాళీయంగా వచ్చేవి మరికొన్ని. శర్వానంద్ కు అలాంటిది ఒకటి ఉందండోయ్. అదే పండగ సెంటిమెంట్. ఇప్పటిదాకా శర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన శతమానం భవతి-ఎక్స్ ప్రెస్ రాజా-రన్ రాజా రన్-మహానుభావుడు అన్ని కూడా అయితే సంక్రాంతి లేదా దసరా దీపావళిని టార్గెట్ చేసుకుని వచ్చి సూపర్ సక్సెస్ కొట్టాయి.

అందులోనూ అపోజిషన్ లో తీవ్రమైన పోటీ ఎదురుకుని హిట్ అయిన సినిమాలే ఇవన్ని. అందుకే ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు శర్వానంద్ ఫ్యాన్స్. డిసెంబర్ 21న విడుదల కాబోతున్న పడి పడి లేచే మనసు మీద ఇప్పటికే పోజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ ఉంది. ట్రైలర్ తో పాటు ఆడియో కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే సినిమా వచ్చిన నాలుగు రోజులకే క్రిస్మస్ పండగ ఉంది. ముందు చెప్పిన ఉదాహరణల తరహాలోనే ఈ సారి కూడా తీవ్రమైన పోటీ ఉంది.

సో పడి పడి లేచే మనసు కూడా ష్యూర్ షాట్ హిట్ అవుతుందనే వాదన ఫ్యాన్స్ లో ఉంది. వాళ్ళ వెర్షన్ ఎలా ఉన్నా మొదటిసారి కాంబో గా వస్తున్న శర్వానంద్-సాయి పల్లవిల జంట ఇప్పటికే యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఎమోషనల్ లవ్ స్టొరీగా చెబుతున్నారు కాబట్టి ఆ రకంగా కూడా సినిమా మీద అంచనాలు అధికంగా ఉన్నాయి. సో పండగ హీరో గా తన ట్రాక్ రికార్డు కంటిన్యూ చేయబోతున్న శర్వా పడి పడి లేచే మనసు మీద చాలా ధీమాగా ఉన్నాడు