బంగార్రాజు ను మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారా?

Sat Dec 15 2018 23:00:01 GMT+0530 (IST)

మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంలోని బంగార్రాజు పాత్రకు మంచి ఆధరణ దక్కడంతో అప్పటి నుండి కూడా సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’ చుట్టు ఒక మంచి కథను అల్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. నాగార్జున వద్దకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇప్పటి వరకు ఎన్నో స్క్రిప్ట్ లు తీసుకు వెళ్లాడట. కాని ఏది ఫైనల్ కాలేదు. ఎట్టకేలకు నాగార్జునకు నచ్చే ఒక స్టోరీ లైన్ ను దర్శకుడు సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది.బంగార్రాజు స్క్రిప్ట్ మల్టీస్టారర్ ల రెడీ అయ్యిందట. బంగార్రాజు పాత్ర తో పాటు ఒక కీలక పాత్ర కథ లో ఉందట ఆ పాత్రను ఇంకాస్త డెవలప్ చేసి ఆ పాత్రను నాగచైతన్యతో చేయించాలని నాగార్జున భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘మనం’ చిత్రంలో నటించారు. అప్పటి నుండి మరోసారి వీరి కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బంగార్రాజు చిత్రం తో ఆ కోరిక తీరబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే ఈ స్టోరీ లైన్ సెట్ అయ్యింది. ఈ మూవీ పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ లోపు నాగార్జున- నాగచైతన్య లు వేరు వేరుగా రెండు మూడు సినిమాలు చేసేస్తారేమో. బంగార్రాజు మూవీ స్టోరీ లైన్ కు చైతూ కూడా ఆసక్తి చూపించినట్లుగా సమాచారం అందుతోంది. బంగార్రాజు పాత్ర కు రమ్యకృష్ణ ను జోడీ గా ఎంపిక చేయొచ్చు ఇక చైతూ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారా అనేది చూడాలి. ఈ బంగార్రాజు గురించిన పూర్తి వివరాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.