కొత్తమ్మాయి భలే చేసిందే..

Sun Jun 24 2018 22:25:16 GMT+0530 (IST)

కేవలం కథాకథనాలు బాగా తీర్చిదిద్దుకోవడంతో దర్శకుడి పని అయిపోదు. నటీనటులు.. సాంకేతిక నిపుణుల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడమూ కీలకమే. ఇందులోనే దర్శకుడి ప్రత్యేకత కనిపిస్తుంది. కొందరు దర్శకులతో పని చేస్తే సాధారణమైన నటులు కూడా షైన్ అవుతుంటారు. హీరోగా ఎంత ఎదిగినా.. నటుడిగా అంత గొప్ప పేరేమీ సంపాదించని రామ్ చరణ్ నుంచి ‘రంగస్థలం’లో సుకుమార్ ఎంత గొప్ప నటన రాబట్టుకున్నడో తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సైతం ‘సమ్మోహనం’ సినిమాలో సుధీర్ బాబులోని నటుడిని వెలికి తీశాడు. అతనొక్కడేనా.. ఈ చిత్రంలో నటీనటులందరూ సత్తా చాటుకున్నారు.క్యారెక్టర్ ఆర్టిస్టుగా నరేష్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్ శచ్చాడు. హీరోయిన్ అదితిరావు హైదరి.. హీరో తల్లి పాత్రలో కనిపించిన పవిత్రి లోకేష్ సైతం ఆకట్టుకున్నారు. వీరితో పాటు సుధీర్ బాబు చెల్లెలిగా నటించిన అమ్మాయి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె పేరు హర్షిణి. యూట్యూబ్ లో సెలబ్రెటీల ఇంటర్వ్యూల ద్వారా బాగానే పాపులారిటీ సంపాదించిందీ అమ్మాయి. తొలిసారిగా ‘సమ్మోహనం’లో నటించిన ఆమె.. హీరో చెల్లెలి పాత్రను అలవోకగా చేసుకుపోయింది. సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఆమెకిది తొలి సినిమా అని ఎవరికీ అనిపించలేదు. హర్షిణి మంచి నటి అని.. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని.. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కెరీర్లో మంచి స్థాయికి వెళ్లగలదని ఇంద్రగంటి చెప్పాడు. చూద్దాం మరి ఆమె ఎలా ప్లాన్ చేసుకుంటుందో తన కెరీర్.