Begin typing your search above and press return to search.

త్రిష కోసం హ్యారీపోటర్ టెక్నీషియన్స్

By:  Tupaki Desk   |   28 May 2016 1:30 PM GMT
త్రిష కోసం హ్యారీపోటర్ టెక్నీషియన్స్
X
హీరోయిన్లు 30 ప్లస్ లో పడ్డారంటే వాళ్ల కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లే అనుకునేవాళ్లు ఒకప్పుడు. కానీ ఈ మధ్య మాత్రం 30 ప్లస్ లోనూ హీరోయిన్లు దూసుకెళ్లిపోతున్నారు. అనుష్క శెట్టి.. త్రిష.. నయనతార లాంటి వాళ్లందరూ లేటు వయసులో మాంచి ఊపుమీదున్నారు. ఈ ముగ్గురిలో త్రిష కెరీర్ కొన్నేళ్ల కిందట బాగా డల్లయింది. ఇక ఆమె కథ ముగిసినట్లే అనుకుంటుండగా మళ్లీ వరుస అవకాశాలతో తారాపథానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ హార్రర్ కామెడీ మూవీ ‘నాయకి’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ‘మోహిని’ పేరుతో ఇంకో సినిమాలో నటించబోతోంది త్రిష.

ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీనే. ఐతే ఇందులో హార్రర్ ఉంటుంది కానీ.. కామెడీ ఉండదు. మాథేష్ దర్శకత్వం వహించే ఈ సినిమాకు హాలీవుడ్ మూవీ ‘హ్యారీపోటర్’కు పని చేసిన వీఎఫ్ ఎక్స్ నిపుణులు పని చేయబోతుండటం విశేషం. గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్టులకు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసమని హాలీవుడ్ నిపుణుల్ని రప్పిస్తున్నారు. సూపర్ నేచురల్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం ఫారిన్లోనే చేస్తారట. యూకే.. థాయిలాండ్.. మెక్సికో తదితర ప్రాంతాల్లో సన్నివేశాల చిత్రీకరణ కోసం త్రిష అండ్ కో త్వరలోనే ఫ్లైట్ ఎక్కబోతోంది. త్రిష కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కూడా తెలుగు-తమిళ భాషలు రెండింట్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.