విలన్ పాత్రపై మోజు..

Sat Dec 15 2018 23:00:01 GMT+0530 (IST)

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తండ’ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జిగర్తండ మూవీలో హీరోగా సిద్దార్థ నటించగా - విలన్ గా బాబీ సింహా నటించారు. బాబీ సింహా నటనకు గాను జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్నాడు. ఈ చిత్రంలో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర డామినేటివ్ గా ఉంటుంది. అందుకే తెలుగు రీమేక్ లో విలన్ పాత్రకు కూడా ఒక యువ హీరోను తీసుకోవాలని దర్శకుడు భావించాడు.హీరో పాత్ర కోసం మొదట మెగా హీరో వరుణ్ ను హరీష్ శంకర్ సంప్రదించాడట. అయితే సినిమా చూసిన తర్వాత హీరో పాత్ర కంటే బాబీ సింహా పోషించిన విలన్ పాత్రను చేయాలని వరుణ్ కోరుకున్నాడట. డాన్ పాత్రలో నటించాలని ఫిక్స్ అయ్యాడట. హరీష్ శంకర్ కూడా అందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. హీరోలు ఈమద్య విలన్ గా నటించడం కామన్ అయ్యింది. హీరో పాత్రలో కంటే విలన్ పాత్రలో నటించినప్పుడే నటుడిగా ఎక్కువ సంతృప్తి పొందవచ్చు.

వరుణ్ కూడా అందుకే విలన్ పాత్రను పోషంచేందుకు మోజు పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. హరీష్ శంకర్ డీజే చిత్రం తర్వాత పలు సినిమాలను - పలు ప్రాజెక్ట్ లను అనుకున్నాడు. కాని ఇప్పటి వరకు ఏది ముందల పడలేదు. మరి ఈ చిత్రంను అయినా హరీష్ శంకర్ పట్టాలెక్కిస్తాడేమో చూడాలి. వరుణ్ తేజ్ ఒక వేళ ఈ రీమేక్ లో విలన్ గా నటిస్తే సినిమా స్థాయి అమాంతం పెరిగే అవకాశం ఉంది.